బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 12, 2020 , 20:58:19

బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పిన ప‌వన్ భామ‌

బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పిన ప‌వన్ భామ‌

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ క‌ల్యాణ్ తో క‌లిసి తీన్మార్ చిత్రంలో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది కృతిక‌ర్బందా. ఈ ఢిల్లీ భామ ఆ త‌ర్వాత రామ్ తో క‌లిసి ఒంగోలుగిత్త సినిమా చేసింది. చివ‌ర‌గా బ్రూస్ లీ చిత్రంలో క‌నిపించింది. ఇక అటు నుంచి హిందీ, త‌మిళ చిత్రాల‌తో బిజీగా మారిపోయింది. బాలీవుడ్ న‌టుడు పుల్‌కిత్ సామ్రాట్ తో క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్న ఈ బ్యూటీ ..త‌న భాయ్ ఫ్రెండ్ గురించి కొన్ని విష‌యాలు ఫాలోవ‌ర్ల‌తో షేర్చేసుకుంది.

పుల్‌కిత్ సామ్రాట్ మంచి యాక్ట‌ర్ అని సెట్ లో ప్ర‌తీ ఒక్క‌రిని స‌మానంగా చూస్తాడ‌ని చెప్పుకొచ్చింది. సెట్ లో అంద‌రితో క‌లుపుగోలుగా ఉంటూ..త‌ను తీసుకునే చొర‌వ వ‌ల్లే పుల్ కిత్ తో రిలేష‌న్‌షిప్ లో జాయిన్ అయిన‌ట్టు చెప్పింది. ఒక‌వేళ పుల్ కిత్ సామ్రాట్ మంచి న‌టుడి కాక‌పోయి ఉంటే తాము రిలేష‌న్ షిప్ లో ఉండేవాళ్లం కాద‌ని చెప్పుకొచ్చింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo