మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 18:36:26

ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి వ‌స్తోన్న కైరాఅద్వానీ

ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి వ‌స్తోన్న కైరాఅద్వానీ

బాలీవుడ్ అందాల తార కైరా అద్వానీ న‌టిస్తోన్న తాజా చిత్రం ఇందూ కీ జ‌వాని. ఆదిత్యా సీల్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీకి అబిర్ సేన్ గుప్తా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తోన్న ఈ ప్రాజెక్టు థియేట‌ర్ల‌లో సంద‌డి చేసేందుకు రెడీ అయింది. డిసెంబ‌ర్ 11న కైరా అద్వానీ త‌న అందం, అభియ‌నంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఎమ్మే ఎంట‌ర్ టైన్ మెంట్ అండ్ ఎల‌క్రిక్ యాపిల్స్ బ్యాన‌ర్ పై టీ సిరీస్ నిర్మిస్తోంది.

ఘ‌జియాబాద్ కు చెందిన యువ‌తి డేటింగ్ యాప్స్ తో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్న‌ద‌నే క‌థాంశం చుట్టూ ఇందూ కీ జ‌వాని సాగ‌నుంది. ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన హ‌సీనా పాగ‌ల్ దివాని వీడియో సాంగ్ లో కైరా మెస్మ‌రైజింగ్ లుక్ లో ఆదిత్య‌సీల్ తో క‌లిసి అదిరిపోయే స్టెప్పులేసి అద‌ర‌గొట్టిన విష‌యం తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.