బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 23, 2020 , 19:45:31

కైరా అద్వానీ 'ఇందూ కీ జ‌వానీ' ట్రైల‌ర్

కైరా అద్వానీ  'ఇందూ కీ జ‌వానీ' ట్రైల‌ర్

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ-ఆదిత్యా సీల్ కాంబోలో వ‌స్తున్న చిత్రం ఇందూకీ జ‌వానీ. ఈ మూవీ ట్రైల‌ర్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. ఘ‌జియాబాద్ కు చెందిన ఇందూ గుప్తా అనే యువ‌తి తన జీవిత భాగ‌స్వామిని ఎంచుకోవ‌డానికి డేటింగ్ యాప్స్ ను ఆశ్ర‌యిస్తుంది. ఈ క్ర‌మంలో ఆ యువ‌తికి ఎలాంటి ప‌రిణామాలు ఎదురయ్యార‌నే నేప‌థ్యంలో సాగే ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది. మల్లికా దువా కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఇందూ గుప్తా స్నేహితురాలు సోనాల్ గా న‌టిస్తోంది. ఈ మూవీకి అబిర్ సేన్ గుప్తా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తోన్న ఈ ప్రాజెక్టు డిసెంబ‌ర్ 11న థియేట‌ర్ల‌లో సంద‌డి చేసేందుకు రెడీ అవుతోంది.


ఎమ్మే ఎంట‌ర్ టైన్ మెంట్ అండ్ ఎల‌క్రిక్ యాపిల్స్ బ్యాన‌ర్ పై టీ సిరీస్ నిర్మిస్తోంది. కైరా త‌న అందంతో మెస్మ‌రైజ్ చేస్తూనే, మ‌రోవైపు ఎంట‌ర్ టైన్ చేయ‌డం ఖాయ‌మ‌ని ట్రైల‌ర్ చెబుతోంది. కైరా ఇటీవ‌లే అక్ష‌య్ కుమార్ తో క‌లిసి ల‌క్ష్మీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా..మిక్స్ డ్ తెచ్చుకుంది. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo