మేలిమి బంగారంలా కైరా..ట్రెండింగ్‌లో ఫొటో

Nov 26, 2020 , 14:29:16

బాలీవుడ్ భామ కైరా అద్వానీ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్‌జోష్ మీదున్న సంగ‌తి తెలిసిందే. ఈ బ్యూటీ తెలుగు, త‌మిళం, హిందీలో చేసింది కొన్ని సినిమాలే అయినా త‌న అందం, అభిన‌యంతో కోట్లాదిమంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. తాజాగా ఈ సొగ‌స‌రి గోల్డెన్ శారీలో ద‌గ‌ద‌గ మెరిసిపోతుంది. కైరా న‌టిస్తోన్న ఇందూ కీ జ‌వానీ సినిమాలోనిదీ స్టిల్‌. హీలీన్ టూట్ గ‌యీ పాట‌లో గోల్డెన్ శారీలో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి వ‌స్తోంది. చేతిలో బ్లాక్ ప‌ర్సు ప‌ట్టుకుని, లో క‌ట్ స్లీవ్ లెస్ బ్లౌస్ ధ‌రించి మెరుస్తున్న శారీలో మేలిమి బంగారంలా క‌నిపిస్తోంది.

ఈ ఫొటోపై టాలీవుడ్ భామ స‌మంత అక్కినేని ఊ లా లా అంటూ ఫైర్ ఎమోజీని పోస్ట్ చేసింది. అభిర్ సేన్ గుప్తా డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ చిత్రం కామెడీ జోన‌ర్ లో వ‌స్తోంది. ఈ ఫొటో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD