మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Jul 28, 2020 , 16:38:10

‘చంద్రముఖి-2’లో బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ.!

‘చంద్రముఖి-2’లో బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ.!

హైదరాబాద్‌ : రాఘవలారెన్స్‌ హీరోగా నటిస్తున్న ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. 2005లో పి.వాసు దర్శకత్వంలో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, జ్యోతిక, నయనతార నటించిన ‘చంద్రముఖి’ మంచి విజయం సాధించింది. ఆ చిత్రం రెండో పార్ట్‌కు కూడా పి. వాసు దర్శకత్వం వహించనున్నారు. హీరోగా రాఘవ లారెన్స్‌ ఎంపికయ్యారు. చంద్రముఖి ఫస్ట్‌పార్ట్‌లో ప్లాష్‌బ్యాక్‌లో రజనీ వేట్టయ్యన్‌ అనే దుష్ట మహారాజుగా నటించారు.

రాజ నర్తకి చంద్రముఖి నిండు సభలో నృత్యం చేస్తుండగా ఆమె ప్రియుడిని వేట్టయ్యన్‌ అనే మహారాజు చంపుతాడు. వేట్టయ్యన్‌, రాజనర్తకి చంద్రముఖి నడుమ జరిగే ఘర్షణల నేపథ్యంలో కొత్త కథ తయారు చేసి దర్శకుడు వాసు ‘చంద్రముఖి-2’ను రూపొందించనున్నారు. అయితే ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.