సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Sep 16, 2020 , 15:56:38

రూ.2 కోట్లు న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించండి: క‌ంగ‌నా పిటిష‌న్

రూ.2 కోట్లు న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించండి: క‌ంగ‌నా పిటిష‌న్

ముంబై: ముంబైలో బీఎంసీ అధికారులు కూల్చివేసిన త‌న కార్యాల‌యానికి న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ డిమాండ్ చేస్తోంది. ఈ మేర‌కు త‌న‌కు రూ.2 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించాల‌ని కోరుతూ బాంబే హైకోర్టులో కంగ‌నా స‌వ‌ర‌ణ‌ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. నిబంధ‌న‌లకు విరుద్ధంగా నిర్మించార‌ని ఆరోపిస్తూ అక్ర‌మంగా బాంద్రాలోని మ‌ణిక‌ర్ణిక ఫిలిమ్స్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ను  బీఎంసీ అధికారులు కూల్చివేశార‌ని కంగ‌నా మండిప‌డింది.

శివ‌సేన నేతృత్వంలోని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చేసిన వ్యాఖ్య‌లకు ప్ర‌తిఫ‌లంగా త‌న ఆఫీసును కూల్చివేశార‌ని కంగ‌నా స‌వ‌ర‌ణ పిటిష‌న్ లో పేర్కొంది.  బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో కూడా శివ‌సేన అధికారంలో ఉంద‌ని, త‌న వ్యాఖ్య‌లు న‌చ్చ‌క‌నే ఇలా చేసింద‌ని పిటిష‌న్ లో పేర్కొంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo