గురువారం 04 మార్చి 2021
Cinema - Feb 23, 2021 , 20:42:05

బాలీవుడ్ 'క్వీన్' కంగ‌నా క‌ల నెర‌వేరిన వేళ‌

బాలీవుడ్ 'క్వీన్' కంగ‌నా క‌ల నెర‌వేరిన వేళ‌

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి...ఇండియాలోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్  స్టార్ హీరోయిన్ గా నీరాజ‌నాలు అందుకుంటుంది మ‌నాలి భామ కంగ‌నార‌నౌత్‌. ప్ర‌స్తుతం త‌లైవి, ధాక‌డ్, తేజాస్ వంటి ప్ర‌తిష్టాత్మ‌క సినిమాల‌తో బిజీగా ఉందీ బాలీవుడ్ క్వీన్‌. ఇన్నాళ్ల‌కు కంగ‌నార‌నౌత్ క‌ల నెర‌వేరింది. ఇంత‌కీ ఈ భామ‌కున్న ఆ డ్రీమ్ ఏంటో తెలుసా..? వ‌్యాపార రంగంలోకి రావ‌డం. త‌న స్వ‌స్థ‌లం మ‌నాలీలో ఫుడ్ అండ్ బేవ‌రేజెస్ బిజినెస్ మొద‌లుపెట్టే ప‌నుల‌ను షురూ చేసింది కంగనా.

ఈ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంటూ..కేఫ్, రెస్టారెంట్ ఓపెన్ చేసే ప్రాంతంలో సోద‌రి రంగోలి చండేల్ అండ్ టీంతో చ‌ర్చిస్తున్న ఫొటోల‌ను ట్విట‌ర్ లో షేర్ చేసుకుంది. నా డ్రీమ్ వెంచ‌ర్ ను మీ అంద‌రితో షేర్ చేసుకుంటున్నా. సినిమాల త‌ర్వాత నాకు ఇష్ట‌మైంది ఫుడ్ అండ్ బేవ‌రేజెస్ ను ఏర్పాటు చేయ‌డం. మ‌నాలీలో నా తొలి కేఫ్‌, రెస్టారెంట్ ను రెడీ చేస్తున్నా. అద్బుతంగా తీర్చిదిద్దాల‌నుకుంటున్న నా టీంకు ధ‌న్య‌వాదాలు అని ట్వీట్ చేసింది కంగ‌నా.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo