కైరా అద్వానీ డేరింగ్ డెసిష‌న్..!

Nov 25, 2020 , 20:47:28

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ న‌టిస్తోన్న కొత్త చిత్రం ఇందూ కీ జ‌వానీ. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. కేంద్ర‌ప్ర‌భుత్వం 50 శాతం కెపాసిటీతో థియేట‌ర్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమ‌తిచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటి ప‌రిస్థితుల్లో సినిమాలు విడుద‌లైతే నిర్మాత‌ల‌కు సినిమా క‌లెక్ష‌న్ల ప‌రంగా ఎంత ‌వ‌ర‌కు గిట్టుబాటు అవుతుంద‌నేది మాత్రం ఇప్పుడే చెప్ప‌లేని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో కైరా అద్వానీ చిత్రాన్ని జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించ‌డం సాహ‌స‌మ‌నే చెప్పాలి.

నిర్మాత‌లు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉండి..కైరా గ్లామ‌ర్ సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. డేటింగ్ యాప్స్ లో జీవిత భాగ‌స్వామిని వెతికే క్ర‌మంలో ఓ యువ‌తికి ఎలాంటి ప‌రిణామాలు ఎదురయ్యానే క‌థాంశంతో వ‌స్తోన్న ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. మ‌రి ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటార‌నేది కాల‌మే నిర్ణ‌యిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD