ఆదివారం 17 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 17:17:00

గేటు దూకి పారిపోయిన జాన్వీకపూర్..!

గేటు దూకి పారిపోయిన జాన్వీకపూర్..!

బాలీవుడ్ యువ నటీన‌టుల్లో కార్తీక్ ఆర్య‌న్ తోపాటు జాన్వీక‌పూర్ కు చాలా మందే ఫాలోవ‌ర్లున్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ల‌వ్ ఆజ్ క‌ల్ సినిమాతో ప్రేక్ష‌కులను ప‌లుకరించాడు. రెండు చిత్రాలు వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్నాయి. ఇదిలా ఉంటే కార్తీక్-జాన్వీ కాంబోలో క‌ర‌ణ్ జోహార్ ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్టు బీటౌన్ లో కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు విష‌యంలో వ్యూహాత్మ‌కంగా ప‌బ్లిసిటీ చేస్తున్న‌ట్టు తాజా ప‌రిణామాల‌ను చూస్తే తెలుస్తోంది. ఇటీవ‌లే కార్తీక్‌-జాన్వీ క‌పూర్ ముంబైలోని ఓ బిల్దింగ్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా..వారి ద‌గ్గ‌ర మీడియా వాళ్లు ప‌రుగెత్తుకెళ్లారు. అయితే జాన్వీ మీడియా కంట‌ప‌డ‌కుండా వెంట‌నే బిల్డింగ్ వెన‌కున్న గేటు జంప్ చేసి పారిపోయింద‌ట‌.

కార్తీక్ ఆర్య‌న్ మాత్రం చ‌క్క‌గా న‌డుచుకుంటూ వ‌చ్చి కెమెరాల‌కు ఫోజులిచ్చాడు కానీ ఎలాంటి కామెంట్స్ చేయ‌లేద‌ట‌. ఇదంతా చూస్తుంటే క‌ర‌ణ్ జోహార్ మార్కెటింగ్ జిమ్మిక్కులో భాగంగానే కార్తీక్‌-జాన్వీ ఇలా చేశార‌ని అంతా చ‌ర్చించుకుంటున్నారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.