శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 19:16:11

షాకింగ్ లుక్ లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్

షాకింగ్ లుక్ లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్

బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్ట‌న్నింగ్ పోజుతో అంద‌రికీ షాకిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యాన్స్ , ఫాలోవ‌ర్ల‌కు స‌ర్‌ప్రైజ్ చేస్తూ పోస్ట్ చేసిన స్టిల్ నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. బ్లాక్ ఓపెన్ జాకెట్ తో బాడీని క‌వర్ చేస్తూ జాలువారుతున్న కురుల‌తో కెమెరాకు పోజులిచ్చింది. ఈ స్టిల్ ను ఇన్‌స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ చాలా చాలా దూరం అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ ఫొటోకు 543 వేల లైక్స్ వ‌చ్చాయి. జాక్వెలిన్ ప్ర‌స్తుతం సైఫ్ అలీఖాన్‌, అర్జున్ క‌పూర్, యామీ గౌత‌మ్ న‌టిస్తోన్న భూత్ పోలీస్ మూవీలో న‌టిస్తోంది.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ధ‌ర‌మ్ శాలా, డ‌ల్హౌసీ ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. రన్‌వీర్ సింగ్ తో క‌లిసి స‌ర్క‌స్ సినిమాలో కూడా న‌టిస్తోంది. దీంతో స‌ల్మాన్ ఖాన్ తో కిక్-2 చేయాల్సి ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.