శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 17:34:34

దిశాప‌టానీ టోర్న‌డో కిక్స్..వీడియో వైర‌ల్

దిశాప‌టానీ టోర్న‌డో కిక్స్..వీడియో వైర‌ల్

దిశాప‌టానీ-టైగ‌ర్ ష్రాప్..ఈ ఇద్ద‌రు బాలీవుడ్ స్టార్లు క‌నిపించారంటే చాలు కెమెరాల చూపంతా వారిపై ప‌డుతుంది. ఈ ఇద్దరు స్టార్లు ఫిట్ నెస్ మంత్ర‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటిస్తారు. దిశాప‌టానీ త‌న శ‌క్తికి మించి జిమ్ లో సీరియ‌స్ లో వ‌ర్క‌వుట్స్ చేసిన ఫొటోలు,వీడియోలు ఇప్ప‌టికే నెట్టింట్లో వైర‌ల్ అయ్యాయి. తాజాగా ఈ భామ త‌న బాయ్ ఫ్రెండ్ ను ఫాలో అవుతూ రిస్కీ్ స్టంట్ ఒక‌టి చేసింది. టైగ‌ర్ ష్రాప్ చేసిన‌ టోర్న‌డో కిక్స్ ను దిశాప‌టానీ చాలా సుల‌భంగా చేసి ఔరా అనిపించింది. టైగ‌ర్ ష్రాప్ తల్లి అయేషా ష్రాప్ దిశా ప‌టానీ టాలెంట్ కు ఫిదా అయిపోయి..సూప‌ర్ అంటూ కామెంట్ పెట్టింది.

అంతేకాదు బాయ్‌ఫ్రెండ్ టైగ‌ర్ ష్రాప్ కూడా ఈ వీడియోను లైక్ చేశాడు. టైగ‌ర్ ష్రాప్ కు నేనేమాత్రం తీసిపోను అన్న‌ట్టుగా దిశాప‌టానీ చేసిన టోర్న‌డో కిక్స్ వీడియో ఆన్ లైన్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.