సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 11, 2020 , 19:15:13

సీత పాత్ర‌కు ఒకే చెప్పిన అనుష్క‌..?

సీత పాత్ర‌కు ఒకే చెప్పిన అనుష్క‌..?

టాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్  ప్ర‌భాస్ లీడ్ రోల్ లో ఆదిపురుష్ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఓం రావ‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నుండ‌గా..సీత పాత్ర‌లో క‌నిపించే న‌టి ఎవ‌‌ర‌నే విష‌యంపై ప‌లువురి పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి.  సీత పాత్ర కోసం ఇప్ప‌టికే కీర్తిసురేశ్‌, కైరా అద్వానీ, ఊర్వ‌శి రూటేలా పేర్లు ప్ర‌ముఖంగా వినిపించాయి.

తాజాగా మ‌రో బాలీవుడ్ నటి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. డైరెక్ట‌ర్ ఓం రావ‌త్ బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ‌ను సంప్ర‌దించి..క‌థ‌ను వినిపించాడ‌ట‌. ఓం రావ‌త్ క‌థ చెప్పిన విధానానికి అత‌ని విజ‌న్ కు అనుష్క ఫిదా అయిపోయింద‌ట‌. ఓం రావ‌త్, అనుష్క మీటింగ్ చాలా పాజిటివ్ గా సాగిన‌ట్టు బీటౌన్ టాక్‌. అయితే విరాట్‌కోహ్లీ-అనుష్క మొద‌టి చిన్నారి కోసం ఎదురుచూస్తున్న‌ట్టు ఇటీవ‌లే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అనుష్క డెలివ‌రీ త‌ర్వాత 2 నెల‌ల్లో షూటింగ్ లో జాయిన్ కానుంద‌ట‌. మ‌రి ఈ వార్త‌లపై ప్ర‌భాస్ టీం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఆదిపురుష్ షూటింగ్ జ‌వ‌వ‌రి నుంచి షురూ కానుండ‌గా..మొద‌టి షెడ్యూల్ లో ప్ర‌భాస్‌, సైఫ్ అలీఖాన్ మ‌ధ్య వచ్చే స‌న్నివేశాల‌ను షూట్ చేయ‌నున్న‌ట్టు టాక్‌. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo