ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 15:42:08

పెళ్లికూతురులా అంకితా..ట్రెండింగ్ లో స్టిల్స్

పెళ్లికూతురులా అంకితా..ట్రెండింగ్ లో స్టిల్స్

ప‌విత్ర రిష్తా సీరియ‌ల్ తో పాపుల‌ర్ అయింది ఇండోర్ భామ అంకితా లోఖండే. ఈ బ్యూటీ తాజాగా పెళ్లికూతురైంది. అవును మీరు విన్న‌ది నిజ‌మే. కానీ నిజంగా కాదండోయ్‌. ఫొటోషూట్ కోసం మ‌హారాష్ట్రియన్ ‌వ‌ధువులా మారింది. అంకిత న‌వ‌రాత్రి ఫొటోషూట్ లో పాల్గొంది. సంప్ర‌దాయబ‌ద్ద‌మైన‌ గ్రీన్ సారీలో..మెడ‌లో నెక్లెస్‌, ముత్యాల‌హారంతో పెళ్లికూతురిలా ముస్తాబై కెమెరాకు పోజులిచ్చింది అంకిత‌.

ల‌వ్ ఫ‌ర్ మ‌రాఠీ జ్యుయెల‌రీస్, మ‌రాఠీ ఫుడ్‌, మరాఠీ పెండ్లికూతురు..అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది అంకిత‌. ఫొటోషూట్ స్టిల్స్, వీడియోల‌ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయ‌గా..ఇపుడు ట్రెండ్ అవుతున్నాయి. అంకితా లోఖండే మ‌ణిక‌ర్ణిక‌..ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, బాఘీ చిత్రాలతో సిల్వ‌ర్ స్క్రీన్ పై త‌న న‌ట‌న‌తో ఆకట్టుకుంది. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo