బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 15:13:43

పాపులారిటీ గురించి 'అతిథి' భామ ఏం చెప్పిందంటే?

పాపులారిటీ గురించి 'అతిథి' భామ ఏం చెప్పిందంటే?

తెలుగులో చేసింది ఒకే చిత్రం అతిథి. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో న‌టించి ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో చిర‌స్థాయిగా చెర‌గ‌ని ముద్ర‌వేసుకుంది ముంబై భామ అమృతారావు. గ‌తేడాది థాక‌రే సినిమాతో చివ‌రిసారిగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. 2002లో తాను బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన‌పుడు, ప్ర‌స్తుతం యాక్ట‌ర్ గా వ‌చ్చే ఇమేజ్ ఎలా ఉందో చెప్పుకొచ్చింది.  సోష‌ల్ మీడియా కాలానికి ముందు పీఆర్ ఏజెన్సీలు ఒక‌లా ఉండేది. ఈ రోజుల్లో యాక్ట‌ర్ కు పాపులారిటీ, సెల‌బ్రిటీ హోదా అనేది వారి టాలెంట్ కు బై ప్రొడ‌క్టు వంటిది.

నేను టీనేజ‌ర్ గా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌పుడు ఇష్క్ విష్క్‌, మ‌స్తీ, మై హౌ నా వంటి చిత్రాల్లో న‌టించిన‌పుడు ప్ర‌జ‌లు న‌ట‌న ఆధారంగా న‌న్ను గుర్తించారు. కానీ ఈ రోజుల్లో సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా క‌నిపిస్తే పాపుల‌ర్ అయిపోతున్నారు. ఓ యాక్ట‌ర్ గుర్తుండిపోవాలంటే వారు చేసే మంచి పాత్ర, మంచి సినిమాల‌తో సాధ్య‌మ‌వుతుందని నేను న‌మ్ముతాన‌ని చెప్పుకొచ్చింది. అమృతారావు ప్ర‌స్తుతం ది లెజెండ్ ఆఫ్ కునాల్‌, స‌త్సంగ్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా..ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo