శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 15:01:52

2 నెల‌లు రాజ‌మౌళికి ఇచ్చేసిన అలియాభ‌ట్‌..!

2 నెల‌లు రాజ‌మౌళికి ఇచ్చేసిన అలియాభ‌ట్‌..!

టాలీవుడ్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కి్స్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బ‌డ్జెట్‌తో వ‌స్తోన్న ఈ ప్రాజెక్టులో రాంచ‌ర‌ణ్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ చేస్తుండ‌గా..బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అలియాభ‌ట్ షూటింగ్ లో జాయిన్ కావాల్సి ఉండ‌గా..లాక్ డౌన్ ఎఫెక్ట్ తో చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింది. ఇక న‌వంబ‌ర్ లో ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి వెళ్ల‌డం దాదాపు ఖాయ‌మ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో అలియా భ‌ట్ జ‌క్క‌న్నకు షూట్ కోసం బ‌ల్క్ డేట్స్ ఇచ్చిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. రాజ‌మౌళికి అలియాభ‌ట్ న‌వంబ‌ర్, డిసెంబ‌ర్ మొత్తం డేట్స్ ఇచ్చింద‌ని, ఈ రెండు నెల‌ల కాలంలో త‌న పోర్ష‌న్ ను పూర్తి చేయ‌మ‌ని జ‌క్క‌న్నకు సూచించిన‌ట్టు టాక్‌. దీంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పుడు మొద‌లైనా..రాజ‌మౌళి మొద‌ట‌గా అలియాభ‌ట్ పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తాడ‌ని తెలుస్తోంది. అయితే దీనిపై మ‌రికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo