ఆదివారం 29 నవంబర్ 2020
Cinema - Oct 20, 2020 , 16:29:03

పేర్లు మార్చుకున్న షారుక్‌-కాజోల్‌

పేర్లు మార్చుకున్న షారుక్‌-కాజోల్‌

దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే..షారుక్‌ఖాన్‌-కాజోల్ కాంబోలో వ‌చ్చిన ఈ చిత్రం భార‌త సినీ చరిత్ర‌లో మైలురాయిగా నిలిచిపోయింది. ల‌వ్‌, ఫ్యామిలీ, ఎమోష‌న్, రొమాంటిక్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా నేటితో 25 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఈ ప్రాజెక్టులో షారుక్ ఖాన్ పోషించిన రాజ్ మ‌ల్హోత్రా, కాజోల్ పోషించిన సిమ్ర‌న్ పాత్ర‌లు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. త‌మ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే 25వ వార్షికోత్స‌వం జ‌రుపుకుంటున్న సందర్భంగా షారుక్ ఖాన్‌, కాజోల్ ట్విట‌ర్ హ్యాండిల్ లో త‌మ పేర్ల‌ను మార్చుకున్నారు. షారుక్ ఖాన్ రాజ్ మ‌ల్హోత్రాగా పేరు మార్చుకోగా..కాజోల్ సిమ్ర‌న్ గా మార్చికుంది. 

25 సంవ‌త్స‌రాలుగా రాజ్, సిమ్ర‌న్ల‌ను హృద‌య పూర్వ‌కంగా ప్రేమించినందుకు ధ‌న్య‌వాదాలు. ఈ రోజు నాకు చాలా ప్ర‌త్యేక‌మైన రోజు అంటూ షారుక్ క్యాప్ష‌న్ ఇచ్చాడు. రాజ్‌, సిమ్ర‌న్..ఇద్ద‌రు వ్య‌క్తులు..ఒక సినిమా..25 ఏండ్ల ప్రేమ ఆగ‌లేదు..అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది కాజోల్‌. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.