శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 20:15:14

ర‌ణ్ వీర్ కు బై చెప్పి సిద్దాంత్ తో వెళ్లిన దీపికాప‌దుకొనే

ర‌ణ్ వీర్ కు బై చెప్పి సిద్దాంత్ తో వెళ్లిన దీపికాప‌దుకొనే

దీపికాప‌దుకొనే-ర‌ణ్ వీర్ సింగ్..ఈ బాలీవుడ్ క్రేజీ క‌పుల్ క‌నిపించారంటే చాలా కెమెరాల కండ్ల‌న్నీ వారిపైనే ప‌డ‌తాయి. దీపికా-ర‌ణ్ వీర్ ఒక‌రిపై మ‌రొక‌రు అమితమైన ప్రేమ‌ను చూపించుకుంటూ త‌మ ఫాలోవ‌ర్ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఇటీవ‌లే ఈ జంట ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా ద‌గ్గ‌ర సందడి చేసింది. సినిమా షూటింగ్ కోసం వెళ్తున్న త‌న స‌తీమ‌ణి దీపికాకు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెంట వ‌చ్చాడు ర‌ణ్ వీర్.

బ్లూ డ్రెస్ లో ర‌ణ్ వీర్ స్టైలిష్ లుక్ లో క‌నిపిస్తుండ‌గా..దీపికా సింపుల్ టీష‌ర్ట్-బ్లాక్ జాగ‌ర్స్ ప్యాంట్స్ లో క‌నిపించింది. ర‌ణ్ వీర్ బై చెప్పగానే దీపికా కోస్టార్ సిద్దాంత్ చ‌తుర్వేదితో క‌లిసి గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి అలీబాగ్ కు బోటులో వెళ్లింది. శ‌కున్ బ‌త్రా కొత్త చిత్రం అక్క‌డే షూటింగ్ జ‌రుపుకుంటోంది. దీపికాకు సెండ్ ఆఫ్ ఇస్తున్న ఫొటోలు, సిద్దాంత్ తో క‌లిసి వెళ్తున్న స్టిల్స్ ఇపుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.