శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 16:00:53

షారుక్ కొత్త లుక్..' ప‌ఠాన్' కోస‌మేనా..?

షారుక్ కొత్త లుక్..' ప‌ఠాన్'  కోస‌మేనా..?

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్‌ఖాన్ ఇపుడు సరికొత్త లుక్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. లాంగ్ హెయిర్ తో స్పోర్ట్స్ లుక్ లో యశ్‌రాజ్‌ఫిలింస్ స్టూడియో దగ్గర షారుక్ ప్రత్యక్షమైన ఫొటోలు ఇపుడు ఆన్ లైన్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. షారుక్‌ఖాన్-అనుష్క శ‌ర్మతో క‌లిసి న‌టించిన చిత్రం జీరో. 2018లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ మూవీ త‌ర్వాత మ‌రే చిత్రం చేయ‌లేదు. య‌శ్‌రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్ లో షారుక్ ఖాన్ ప‌ఠాన్ అనే కొత్త చిత్రాన్ని చేస్తున్న‌ట్టు కొంత‌కాలంగా టాక్ న‌డుస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో షారుక్ ఇవాళ ఉద‌యం య‌శ్‌రాజ్ ఫిలింస్ స్టూడియో ద‌గ్గ‌ర క‌నిపించాడు.

లాంగ్ గ్యాప్ తర్వాత షారుక్ ఇలా న్యూ లుక్ లో క‌నిపించ‌గా..ఈ గెట‌ప్ షారుక్ కొత్త సినిమాదేన‌ని అభిమానులు తెగ చ‌ర్చించుకుంటున్నారు. షారుక్ ప‌ఠాన్ షూటింగ్ ను షారుక్ షురూ చేసినట్టు బీటౌన్ వ‌ర్గాల స‌మాచారం. ఈ చిత్రంలో దీపికాపదుకొనే, జాన్ అబ్ర‌హాం కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.