క్వివ్ : ప్రయాణ చార్జీ చెల్లించకుండా ఓ వ్యక్తి చేసిన పనితో పలువురు విస్తుపోయారు. చార్జీ చెల్లించాల్సి వస్తుందని ఉక్రెయిన్ లో ఓ వ్యక్తి ట్రామ్ కిటికీ నుంచి కిందకు దూకిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
పోలీసులు వచ్చే లోపు నిబంధనలు ఉల్లంఘించే వారు ఇలా పారిపోతున్నారని ఈ వీడియోను ఫేస్భుక్ లో షేర్ చేసిన సోషల్ మీడియా యూజర్ తరస్ ఖ్విల్ క్యాప్షన్ ఇచ్చారు. ఉక్రెయిన్ లోని చెకసీ ఒబ్లాస్ట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకకుంది. ఈ ఉదంతంపై నెటిజన్లు తలోరకంగా స్పందించారు. ఆ వ్యక్తి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడా అని ఆరా తీశారు.