ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 10, 2020 , 19:04:52

ఫాంహౌస్‌లో సల్మాన్‌ ఏం చేస్తున్నాడో చూడండి..వీడియో

ఫాంహౌస్‌లో సల్మాన్‌ ఏం చేస్తున్నాడో చూడండి..వీడియో

ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ చేతినిండా ప్రాజెక్టులతో ఎప్పుడూ బిజీబిజీగా ఉంటాడనే విషయం తెలిసిందే. సినిమాలు, షోలు, ఈవెంట్స్‌తో బిజీగా ఉండే సల్లూభాయ్‌కి కరోనా నేపథ్యంలో విరామం దొరికింది. లాక్‌డౌన్‌ టైంలో వలస కూలీలకు తన వంతు సాయం చేసిన సల్లూభాయ్‌..ఇపుడు పన్వేల్‌ ఫాంహౌస్‌లో సరదాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఫాం హౌస్‌ లో సెలయేళ్లు, పచ్చని చెట్ల మధ్య కాలినడకన కలియతిరుగుతూ సేద తీరాడు. సల్మాన్‌ ఖాన్‌  బ్లాక్‌ షార్ట్‌, టీ షర్టుతో ఫాంహౌస్‌లో తిరుగుతున్నపుడు.. సల్మాన్‌ బాడీగార్డ్‌ శెరా తీసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

లెజెండ్‌ను ఫాలో అవుతున్నా. నా మాలిక్‌ సల్మాన్‌ఖాన్‌ అని హ్యాష్‌ట్యాగ్‌ జోడించాడు శెరా. సల్మాన్‌తోపాటు మరికొంతమంది కూడా నడచుకుంటూ వెళ్తున్నట్టు వీడియోలో చూడొచ్చు. మిగితా వారిలో సల్మాన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ లులియా వాంటూర్‌ కూడా ఉండొచ్చింటున్నారు అభిమానులు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo