బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 16:11:34

'రాధే' సెట్స్ లో ఎమోష‌న్ అయిన స‌ల్మాన్‌..!

'రాధే' సెట్స్ లో ఎమోష‌న్ అయిన స‌ల్మాన్‌..!

బాలీవు్డ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఇటీవ‌లే రాధే చిత్ర షూటింగ్ లో జాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆరున్న‌ర నెల‌ల విరామం త‌ర్వాత ఈ చిత్రం కోసం మ‌రోసారి మేక‌ప్ వేసుకున్నాడు. లోనావాలాలో సినిమా షూటింగ్ కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే హీరోయిన్ దిశాప‌టానీ షూటింగ్ పార్టు పూర్త‌వ‌గా..స‌ల్లూభాయ్ కు సంబంధించిన కొన్ని యాక్ష‌న్ సీన్ల‌ను చిత్రీక‌రిస్తున్నారు. అయితే సెట్స్ లో స‌ల్మాన్ ఖాన్ భావోద్వేగానికి లోన‌య్యార‌ట‌. స‌ల్మాన్ ఖాన్ పై ఓ పాట చిత్రీక‌రణ జ‌రుపుతుండ‌గా ఈ ఘ‌టన చోటుచేసుకుంది. 

స‌ల్మాన్ ఖాన్ కు మ్యూజిక్ కంపోజ‌ర్స్ సాజిద్‌-వాజిద్ సోద‌రులకు మ‌ధ్య‌ ఎంత మంచి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్ప‌న‌స‌వ‌రం లేదు. స‌ల్మాన్ కెరీర్ లో సూప‌ర్ హిట్ ద‌బాంగ్ కు సాజిద్‌-వాజిద్ సోద‌రులు మ్యూజిక్ నందించారు. అయితే రాధే చిత్రానికి సాజిద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ చేస్తుండ‌గా..ఈ సారి మాత్రం వాజిద్ క‌నిపించ‌క‌పోయేస‌రికి ఎమోష‌న్ అయ్యాడు స‌ల్లూభాయ్‌. మే 31న వాజిద్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచి‌న సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 6న వాజిద్ బ‌ర్త్ డే అని స‌ల్మాన్ కు సాజిద్ చెప్పాడు. అది విన్న వెంట‌నే సెట్స్ లో ఒక్క‌సారిగా స‌ల్మాన్  భావోద్వేగానికి లోన‌య్యాడు. స‌ల్మాన్‌, సాజిద్‌, సోహైల్ ఖాన్ వాజిద్ ను గుర్తు తెచ్చుకున్నారు.

'నేను చెప్పిన వెంట‌నే స‌ల్మాన్ సెట్స్ కు బ‌ర్త్ డే కేక్ తెప్పించాడు. నేను, స‌ల్మాన్‌, సోహైల్ అన్న‌య్య బ‌ర్త్ డే కేక్ క‌ట్ చేశాం. మేమంతా ఒక్క‌సారి చంద్రుని వైపు చూశాం. అన్నయ్య వాజిద్ పై నుంచి మ‌మ్మ‌ల్ని చూస్తున్నాడ‌ని అనుకున్నాం. స‌ల్మాన్ నా భుజంపై చేయి పెట్టి..వాజిద్ ఎల్ల‌ప్పుతూ మ‌నంద‌రి మ‌ధ్య ఉంటాడు. టెన్ష‌న్ ప‌డొద్దని సూచించాడ‌ని' సాజిద్ చెప్పుకొచ్చాడు. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo