గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 14, 2020 , 13:27:17

పోలీసుల అదుపులో స‌చిన్ జోషి..హైద‌రాబాద్‌కు త‌ర‌లింపు..!

పోలీసుల అదుపులో స‌చిన్ జోషి..హైద‌రాబాద్‌కు త‌ర‌లింపు..!

ఈ ఏడాది మార్చిలో హైద‌రాబాద్ పోలీసులు భారీ మొత్తంలో గుట్కాను సీజ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుల‌ను విచారించ‌గా.. గుట్కా త‌ర‌లింపు ఘ‌ట‌న‌లో ప్ర‌ముఖ న‌టుడు, వ్యాపార‌వేత్త స‌చిన్ జోషి హ‌స్త‌మున్న‌ట్టు తెర‌పైకి వ‌చ్చింది. దీంతో హైద‌రాబాద్ పోలీసులు స‌చిన్ జోషిపై క్రిమిన‌ల్ పీన‌ల్ కోడ్ 41 సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేసి లుకౌట్ నోటీసులు జారీచేశారు. అయితే తాజాగా ముంబై ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టులో స‌చిన్ జోషి ఇమ్మిగ్రేష‌న్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి ముంబైకి రాగానే స‌చిన్ ను నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు..త‌దుప‌రి విచార‌ణ నిమిత్తం హైద‌రాబాద్ కు త‌ర‌లించారు.

గ‌త మార్చిలో హైద‌రాబాద్ లో 80 గుట్కా బాక్సులను స్వాధీనం చేసుకున్నాం. మార్కెట్ లో వీటి విలువ ల‌క్ష‌ల్లో ఉంటుంది.  స‌చిన్ జోషి పేరు బ‌య‌ట‌కు రావ‌డంతో అత‌నిపై బ‌హ‌దూర్ పురా పోలీస్ స్టేష‌న్ లో ఐపీసీ సెక్ష‌న్ 336, 273 కింద కేసు న‌మోదు చేయ‌డం జ‌రిగింది. అత‌డు ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ‌గానే అదుపులోకి తీసుకున్నాం. ఒక‌వేళ అవ‌స‌ర‌మైతే మ‌రోసారి స‌చిన్ జోషిని విచారిస్తామ‌ని పోలీస్ ఉన్న‌తాధికారి ఒక‌రు తెలిపారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.