గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 18:55:02

హార్స్ రైడింగ్ చేసిన బాలీవుడ్ యాక్ట‌ర్..వీడియో వైర‌ల్

హార్స్ రైడింగ్ చేసిన బాలీవుడ్ యాక్ట‌ర్..వీడియో వైర‌ల్

బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ ర‌ణ్‌దీప్ హుడాకు న‌ట‌నంటే ఎంతిష్ట‌మో.. హార్స్ రైడింగ్ కూడా అంతే ఇష్ట‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సినిమాల‌తో బిజీగా ఉండే ర‌ణ్‌దీప్ హుడా..ఎప్పుడు స‌మ‌యం దొరికినా హార్స్ రైడింగ్ పోటీల్లో పాల్గొంటాడు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో స‌ర‌దాల‌న్నింటికీ దూర‌మైన ర‌ణ్ దీప్ హుడా లాంగ్ బ్రేక్ త‌ర్వాత‌ మ‌ళ్లీ గుర్రం ఎక్కాడు. సుదీర్ఘ విరామం త‌ర్వాత మ‌ళ్లీ గుర్రాన్ని క‌లుసుకుని..హార్స్ రైడింగ్ లో పాల్గొనడం చాలా ఎక్సియిటింగ్ గా ఉంద‌ని ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపాడు. క్యూపా (గుర్రం) పై ఎక్కి హార్స్ రైడింగ్ చేస్తున్న వీడియోను ర‌ణ్ దీప్ త‌న అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

చాలా కాలం త‌ర్వాత త‌న మాస్ట‌ర్ ను క‌లుసుకుని, రైడ్ లో పాల్గొనడం ప‌ట్ల క్యూపా కూడా సంతోషంగా ఉంద‌ని క్యాప్ష‌న్ ఇచ్చాడు ర‌ణ్‌దీప్‌. ర‌ణ్ దీప్ హుడా ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న‌ రాధే చిత్రంలో న‌టిస్తున్నాడు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo