శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 21:07:43

కార్గిల్‌ లో షూటింగ్‌..న‌టుడికి బ్రెయిన్ స్ట్రోక్‌

కార్గిల్‌ లో షూటింగ్‌..న‌టుడికి బ్రెయిన్ స్ట్రోక్‌

ఆశిఖి ఫేం యాక్ట‌ర్ రాహుల్ రాయ్ న‌టిస్తోన్న చిత్రం‌ ఎల్ఏసీ..లైవ్ ది బ్యాటిల్‌. కార్గిల్ లో ఈ సినిమా షూటింగ్ కొన‌సాగుతోంది. కార్గిల్ లో వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కార‌ణంగా రాహుల్ రాయ్ హఠాత్తుగా  బ్రెయిన్ స్ట్రోక్ వ‌చ్చింది. దీంతో ఆయ‌న‌ను వెంట‌నే ముంబైలోని నానావ‌తి ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్నారు. మొద‌ట శ్రీన‌గ‌ర్ లోని ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డే ఆయ‌న‌కు కోవిడ్‌-19 ప‌రీక్ష‌లు చేయ‌గా..నెగెటివ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత అక్క‌డి  నుంచి ముంబై నానావ‌తి ఆస్ప‌త్రిలోని ఐసీయూకు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం రాహుల్ రాయ్ కోలుకుంటున్నార‌ని ఆయ‌న సోదరుడు రొమీర్ సేన్ తెలిపాడు.

గాల్వ‌న్ ఘాటి లో జరిగిన య‌దార్థ ఘ‌ట‌నల ఆధారంగా ఎల్ఏసీ చిత్రం తెర‌కెక్కుతుంది. ఈ మూవీలో రాహుల్ రాయ్ మేజ‌ర్ పాత్ర‌లో న‌టిస్ఉత‌న్నారు. నితిన్ కుమార్ గుప్త‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా..చిత్ర వ‌కీల్ శ‌ర్మ‌, నివేదిత బ‌సు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1990లో మ‌హేశ్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆశిఖి చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ రాయ్‌. ఈ సినిమా బాక్సాపీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో స్టార్ హీరోగా మారిపోయాడు రాహుల్‌. ఆ త‌ర్వాత ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.