మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 10, 2020 , 18:32:53

చిరుత బ్యూటీతో స్క్రిప్ట్‌ చదువుతున్న నవాజుద్దీన్‌

చిరుత బ్యూటీతో స్క్రిప్ట్‌ చదువుతున్న నవాజుద్దీన్‌

చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పింది బాలీవుడ్‌ భామ నేహా శర్మ. ఈ చిత్రంలో తన డైలాగ్స్‌తో అందరినీ అలరించింది. కుర్రాడు చిత్రం తర్వాత మళ్లీ ఏ తెలుగు సినిమా చేయలేదు. నేహా శర్మ ప్రస్తుతం బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీతో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఈ విషయాన్ని నవాజుద్దీన్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశాడు. నా కొత్త చిత్రాన్ని ప్రకటిస్తున్నా..అంటూ నేహాశర్మతో కలిసి స్క్రిప్ట్‌ చదువుతున్న స్టిల్‌ ను నవాజుద్దీన్‌ ఇన్‌ స్టాలో షేర్‌ చేశాడు. జోగిరా సార రారా టైటిల్‌తో డైరెక్టర్‌ కుషాన్‌ నాండీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.

నవాజుద్దీన్‌-కుషాన్‌ కాంబినేషన్‌ లో బాబుమోషాయ్‌ బందూక్‌బాజ్‌ సినిమా వచ్చింది. మరోసారి యాక్టర్‌-డైరెక్టర్‌ కాంబో సిల్వర్‌స్క్రీన్‌పై సందడి చేయనుంది. 2021 ఫిబ్రవరి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo