శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 23, 2020 , 13:20:30

మ‌నోజ్ భాజ్ పేయి సినిమా క‌ష్టం చూడండి..వీడియో

మ‌నోజ్ భాజ్ పేయి సినిమా క‌ష్టం చూడండి..వీడియో

సినీ ప‌రిశ్ర‌మ‌లో న‌టీన‌టులు చాలా మంది ఉన్నారు. కానీ ఏ పాత్ర‌లోనైనా ఇట్టే ఇమిడిపోగ‌లిగే న‌టులు మాత్రం కొంత మందే ఉన్నార‌ని చెప్పొచ్చు. ఆ కోవ‌లోకే వ‌స్తాడు బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ భాజ్‌పేయి. తెలుగు, త‌మిళం, హిందీ చిత్రాల్లో త‌న‌దైన విల‌క్ష‌న న‌ట‌న‌తో అల‌రించిన ఈ యాక్ట‌ర్ ఇపుడు విభిన్న అవ‌తారాల్లో ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. దిల్జీత దోసాంజ్‌, ఫాతిమా స‌నా షేఖ్‌, మ‌నోజ్ భాజ్‌పేయి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం సూర‌జ్ పే మంగ‌ళ్ భ‌రీ. అభిషేక్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం సెటైరిక‌ల్ కామెడీ డ్రామాగా వినోదాన్ని అందించేందుకు సిద్ద‌మ‌వుతుంది.

ఈ చిత్రంలో మ‌నోజ్ భాజ్ పేయి వెడ్డింగ్ డిటెక్టివ్ గా న‌టిస్తున్నాడు. పాత్రకు అనుగుణంగా ఈ చిత్రంలో మ‌నోజ్ భాజ్‌పేయి మ‌హిళ‌గా, బిచ్చ‌గాడిగా, ముస్లిం, సిక్కు వ్య‌క్తిగా ఇత‌ర విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు. మ‌నోజ్ భాయ్‌పేయి ను డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో మేక‌ప్ వేస్తున్న దృశ్యాల‌కు సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఒక్కో గెట‌ప్ మేక‌ప్ వేసేందుకు సుమారు 4 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింద‌ట‌. మ‌నోజ్ తెలుగులో ప్రేమ‌క‌థ‌, హ్యాపీ, పులి, వేదం వంటి చిత్రాల్లో న‌టించి మెప్పించాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.