శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 24, 2020 , 06:50:01

బాలీవుడ్‌లో మ‌రో కరోనా కేసు..ఉలిక్కిప‌డ్డ ప‌రిశ్ర‌మ‌

బాలీవుడ్‌లో మ‌రో కరోనా కేసు..ఉలిక్కిప‌డ్డ ప‌రిశ్ర‌మ‌

బాలీవుడ్‌పై క‌రోనా పంజా విసిరింది. హిందీ ప‌రిశ్ర‌మ‌కి చెందిన ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ‌గా, కొద్ది రోజుల చికిత్స త‌ర్వాత కోలుకున్నారు.  ప్రముఖ సింగర్ కనిక కపూర్, నిర్మాత  కరీం మోరాని ఆయ‌న‌ ఇద్దరు కూతుళ్ళు, విల‌క్ష‌ణ నటుడు  ఫ్రెడీ తండ్రి  ,బాలీవుడ్ నటుడు సత్య జిత్ తల్లి, బోని క‌పూర్ ముగ్గురు స‌హాయ‌కులు క‌రోనా బారిన పడ్డ విష‌యం తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు కిరణ్ కుమార్‌ను కరోనా పాజిటివ్‌గా గుర్తించారు.

అనారోగ్యంతో క‌రోనా పాజిటివ్ టెస్ట్‌లు చేయించుకున్న కిర‌ణ్ కుమార్‌కి పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయ‌న గ‌త ప‌ది రోజులుగా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. మే 25న త‌దుపరి టెస్ట్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం తాను క్షేమంగానే ఉన్న‌ట్టు చెబుతున్న కిర‌ణ్ ద‌గ్గు, జ‌లుబు, జ్వరం, శ్వాస తీసుకోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు ఏవి త‌న‌కు లేవ‌ని చెబుతున్నారు. అత‌ని రెండు అంత‌స్తుల ఇంట్లో మొదటి అంతస్తులో భార్యాపిల్ల‌లు ఉండ‌గా, పై అంతస్తులో కిర‌ణ్ కుమార్ ఒంటరిగా ఉన్నారు

కిర‌ణ్ కుమార్ బాలీవుడ్‌లో విల‌న్‌, తండ్రి పాత్ర‌లు పోషిస్తున్నారు. తేజాబ్‌, ఖుదాగువా, ప్యార్ కియా తో డ‌ర్నా క్యా, ముజ్‌సే దోస్తీ క‌రోగే వంటి చిత్రాల‌తో కిర‌ణ్ పాపుల‌ర్ అయ్యారు.  


logo