ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 11, 2020 , 20:44:04

వేధింపుల కేసు పెట్టిన బాలీవుడ్‌ నటుడు

వేధింపుల కేసు పెట్టిన బాలీవుడ్‌ నటుడు

బాలీవుడ్‌ నటి జియాఖాన్‌ మృతి చెందిన తర్వాత యాక్టర్‌ సూరజ్‌పంచోలీపై విమర్శలు రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసుతో కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే ఇటీవలే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో సుశాంత్‌ మేనేజర్‌ దిశా సెలియన్‌ ఆత్మహత్య ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. దిశా మృతి కేసుకు సూరజ్‌పంచోలీని లింకప్‌ చేస్తూ వార్తలు వచ్చాయి. దయచేసి తనపై ఇప్పటికే ఓ కేసు ఉందని, నిరాధారమైన కథనాలతో తనను ఈ కేసులోకి లాగవద్దని సూరజ్‌ ఇప్పటికే విజ్ఞప్తి చేశాడు.

తనపై వస్తున్న కథనాలతో విసుగు చెందిన సూరజ్‌ పంచోలీ ముంబై పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబర్లు, ఫేస్‌బుక్‌ యూజర్లు రకరకాల కథనాలు సృష్టిస్తూ తనపై వేధింపులకు పాల్పడుతున్నారని సూరజ్‌ పంచోలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo