శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Nov 04, 2020 , 13:34:22

బాలీవుడ్‌ నటుడు ఫరాజ్ ఖాన్ క‌న్నుమూత‌

బాలీవుడ్‌ నటుడు ఫరాజ్ ఖాన్ క‌న్నుమూత‌

ముంబై : "ఫరేబ్", "మెహందీ" వంటి సినిమాల్లో నటించిన నటుడు ఫరాజ్ ఖాన్(46) బుధవారం బెంగళూరులో కన్నుమూశారు. ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా అక్టోబర్ 8న ఫ‌రాజ్ ఖాన్‌ ఆసుపత్రిలో చేరారు. న‌టి, ఫిల్మ్ మేక‌ర్ పూజా భ‌ట్ ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. ఫ‌రాజ్ మ‌ర‌ణ వార్త‌ను భార‌మైన హృద‌యంతో తెలియ‌జేస్తున్న‌ట్లు చెప్పారు. బెట‌ర్ ప్లేస్‌కు వెళ్లేందుకు ఫ‌రాజ్ త‌మ‌ని విడిచి వెళ్లిన‌ట్లుగా న‌మ్ముతున్నాన‌న్నారు. ఈ క్లిష్ట స‌మ‌యంలో మీ సహాయం, ప్రార్థ‌న‌ల‌కు ధ‌న్య‌వాద‌ల‌న్నారు. అతను వదిలిన శూన్యాన్ని పూరించడం అసాధ్యం అన్నారు. దివంగత బాలీవుడ్ నటుడు యూసుఫ్ ఖాన్ కుమారుడు ఫ‌రాజ్‌ ఖాన్. మూర్చ కార‌ణంగా గత నెలలో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరాడు. అంత‌కుక్రిత‌మే ఏడాది ద‌గ్గు, ఛాతీలో ఇన్‌ఫెక్ష‌న్‌తో ఫరాజ్ బాధ‌ప‌డుతున్నాడు. 

ఖాన్‌ను ఆసుపత్రికి తీసుకువెళుతున్నప్పుడు మూడుసార్లు మూర్ఛను ఎదుర్కొన్నాడు. వైద్య ప‌రీక్ష‌లో అతని మెదడులో హెర్పెస్ ఇన్ఫెక్షన్ ఉందని, ఛాతీ నుండి అది వ్యాపించిందని తేలింది. వైద్య ఖ‌ర్చుల నిమిత్తం కుటుంబ స‌భ్యులు నిధుల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఖాన్ చికిత్సకు ఆర్థిక సహాయం అందించాల్సిందిగా పూజా భట్ గత నెలలో ప్రజలను కోరారు. స్పందించిన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వైద్య ఖర్చులను చెల్లించారు.

విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన "ఫరేబ్" చిత్రంతో ఫ‌రాజ్‌ ఖాన్ 1996లో బాలీవుడ్‌లో రంగ‌ప్ర‌వేశం చేశారు. సోషల్ డ్రామా "మెహెంది" లో రాణి ముఖర్జీ భర్తగా చేసిన క్యారెక్ట‌ర్‌తో పేరుప్ర‌ఖ్యాత‌ల‌ను పొందాడు. "పృథ్వీ", "దుల్హాన్ బానూ మెయిన్ తేరి", "దిల్ నే ఫిర్ యాద్ కియాష‌, "చంద్ బుజ్ గయా" వంటి ప్ర‌ముఖ‌ సినిమాలు ఖాన్ ఖాతాలో ఉన్నాయి.  అదేవిధంగా "అచనక్ 37 సాల్ బాద్", "లిప్ స్టిక్‌, "స‌చ్ కోయి హై", "రాత్ హోన్ కో హై" వంటి అనేక టీవీ షోలలో ఖాన్ నటించాడు.


logo