శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 23, 2020 , 15:08:04

‘టైమ్స్’ ప్రపంచ ప్రభావశీలుల జాబితాలో ఆయుష్మాన్

‘టైమ్స్’ ప్రపంచ ప్రభావశీలుల జాబితాలో ఆయుష్మాన్

ఆయుష్మాన్ ఖురానా..బిగ్ ఎఫ్ఎమ్ (ఢిల్లీ)లో ఆర్జేగా కెరీర్ ను ప్రారంభించి..టీవీ హోస్ట్ గా పనిచేశాడు. 2012లో వచ్చిన సూజిత్ సర్కార్ రొమాంటిక్ కామెడీ మూవీ విక్కీ డోనార్ తో బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించాడు. తొలి సినిమాతోనే బడా దర్శకనిర్మాతలు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఈ యువ హీరో అరుదైన గౌరవాన్ని పొందాడు. ప్రఖ్యాత యూఎస్ మ్యాగజైన్ ‘టైమ్స్’ ప్రపంచ అత్యంత ప్రభావశీల వ్యక్తుల టాప్‌-100 జాబితాలో ఆయుష్మాన్ చోటు సంపాదించాడు.

ఖాన్స్, కపూర్స్ లేకుండా ఈ ఏడాది టాప్ 100 లిస్ట్ లో చోటు సంపాదించడం విశేషం. ఆయుష్మాన్ నటించిన అంధాధున్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఆర్టికల్ -15, డ్రీమ్ గర్ల్, బాలా వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఇండస్ట్రీకి అందించి టాప్ స్టార్లనే ఒకడిగా నిలిచాడు. ఈ జాబితాలో ఆయుష్మాన్ తోపాటు భారత్ నుంచి ప్రధాని నరేంద్రమోదీ, సుందర్ పిచాయ్, రవీంద్రగుప్తా, బిల్కిస్ దాది ఉన్నారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.