ఆయన వయస్సు 66 ఏండ్లు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల టాలెంట్ కలిగిన నటుడు. బాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించిన యాక్టర్. ఇపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్టిల్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ నటుడెవరనే కదా మీ డౌటు అనుపమ్ ఖేర్..ఆరు పదుల పైబడి వయస్సులో కూడా సీరియస్ గా వర్కవుట్ చేస్తున్న స్టిల్ ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చేస్తోంది.
చేతిలో డంబెల్స్ పట్టుకుని వర్కవుట్ చేస్తున్నపుడుదిగిన బ్యాక్ స్టిల్‌తోపాటు ఫ్రంట్ ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జీవితం సులభమైంది కాదు..క్షమించేది కాదు. మేము మరింత బలంగా, స్థితిస్థాపకంగా ఉంటాం అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు.
ఈ స్టన్నింగ్ ఫొటోపై ఫాలోవర్లు స్పందిస్తూ..ఈ ఫొటో ఓ కళ. ఎప్పటికీ పోగొట్టుకోవద్దు సార్ అంటూ అనుపమ్ ఖేర్ లో మరింత జోష్ నింపుతున్నారు. అనుపమ్ ఖేర్ సతీమణి, రాజకీయ వేత్త కిరణ్ కేర్ కు మల్లీపుల్ మైలోమా (ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్) గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ కపుల్ చాలా ధైర్యంగా ముందుకు సాగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. .
ఇవి కూడా చదవండి..
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్‌ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!