ఆదివారం 24 జనవరి 2021
Cinema - Nov 20, 2020 , 14:37:21

గులాబీ శారీలో మెరిసిపోతున్న దంగ‌ల్ భామ‌..స్టిల్స్ వైర‌ల్

గులాబీ శారీలో మెరిసిపోతున్న దంగ‌ల్ భామ‌..స్టిల్స్ వైర‌ల్

దంగ‌ల్ సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిసింది అందాల బ్యూటీ ఫాతిమా సనా షేక్‌. రెజ్ల‌ర్ గా ఫాతిమా పోషించిన పాత్ర‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్బుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాతో ఒక్క‌సారిగా పాపులారిటీ పెరిగిపోయింది. ఆ త‌ర్వాత థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాలో క‌నిపించినా అశించిన స్తాయిలో విజ‌యం సాధించ‌లేదు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ సోయ‌గం తాజాగా గులాబీ రంగు శారీలో మెరిసిపోతుంది. ముగ్ద‌మ‌నోహ‌ర‌మైన సౌంద‌ర్యంతో రోజ్ క‌ల‌ర్ శారీలో ఉన్న ఫాతిమా చైర్ లో కూర్చొని కెమెరాకు ఫోజులిచ్చింది. మ‌రోవైపు ఫ్లోర‌ల్ డిజైన్ డ్ శారీలో కూడా గాగుల్స్ పెట్టుకుని మెరిసింది. దంగ‌ల్ భామ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోషూట్ స్టిల్స్ నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 

ఫాతిమా న‌టించిన లూడో చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో విడుద‌లైంది. మ‌రోవైపు దిల్జీత్ దోసాంజ్ తో క‌లిసి సూర‌జ్ పే మంగ‌ల్ భ‌రీ చిత్రంలో కూడా న‌టిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వ‌ర్ స్క్రీన్ పై న‌టించిన ఫాతిమా తెలుగులో నువ్వు నేను ఒక్క‌ట‌వుదాం మూవీలో న‌టించింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo