ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 02:03:22

జయంరవి, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో బోగన్‌ చిత్రం

జయంరవి, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో  బోగన్‌ చిత్రం

జయంరవి, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో నటించిన  తమిళ చిత్రం ‘బోగన్‌'ను అదే పేరుతో ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి తెలుగులోకి అనువదిస్తున్నారు. లక్ష్మణ్‌ దర్శకుడు. హన్సిక కథానాయిక. గురువారం ట్రైలర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. నిర్మాత మాట్లాడుతూ ‘ఓ బ్యాంకు దొంగతనం దర్యాప్తు నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆదిత్య అనే దొంగను పట్టుకోవడానికి విక్రమ్‌ అనే పోలీస్‌ అధికారి ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్నది ఆసక్తిని పంచుతుంది. ఊహకందని మలుపులతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఐపీఎస్‌ అధికారిగా జయంరవి, నేరస్తుడిగా అరవిందస్వామి నటన  ఆకట్టుకుంటుంది. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. 


logo