మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 00:05:36

బాడీ షేమింగ్‌ సిగ్గుచేటు

బాడీ షేమింగ్‌ సిగ్గుచేటు

ఒకరి శరీరాకృతి గురించి అవహేళనగా మాట్లాడే ధోరణి పెరిగిపోతోందని..అలాంటి మాటల వల్ల బాధితులు ఎంత క్షోభపడతారో ఆలోచించాలని హితవు పలికింది దక్షిణాది అగ్రనాయిక నిత్యామీనన్‌. ఆమె బరువు గురించి ఇటీవలకాలంలో సోషల్‌మీడియాలో ట్రోల్స్‌ వస్తున్నాయి. అధికబరువు వల్ల సినీ అవకాశాలు తగ్గిపోయాయనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ విషయంపై నిత్యామీనన్‌ మాట్లాడుతూ ‘విమర్శలు చేయడం సులభమే కానీ అసలు  ఏ కారణం చేత బరువు పెరుగుతున్నారు? వాళ్లకేమైనా మానసిక, శారీరకరుగ్మతలు ఉన్నాయా? అనే విషయాల గురించి సహేతుకంగా ఆలోచించే పరిజ్ఞానం ఎవరికీ ఉండదు. ఏవో ఊహాగానాలు చేసుకొని వెకిలి కామెంట్స్‌ చేస్తారు. మన విజయాల్ని చూసి ఓర్వలేని వాళ్లు, ఆత్మన్యూనత భావంతో బాధపడేవాళ్లే ఎదుటివారి మీద విమర్శలు చేస్తారు. చిత్రసీమలో నేను ఏం సాధించానో? నా విలువేమిటో బాగా తెలుసు. అందుకే బాడీ షేమింగ్‌ చేసేవాళ్లపై ఎప్పుడూ స్పందించలేదు. ఏ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడలేదు. నా శరీరాకృతి కంటే నేను సాధించిన విజయాలే నా గురించి లోకానికి చెబుతాయి’ అంటూ భావోద్వేగంగా సమాధానమిచ్చింది.logo