e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News చిరంజీవితో ఠాగూర్ లాంటి చిత్రం ప్లాన్ చేస్తున్న యంగ్ డైరెక్ట‌ర్

చిరంజీవితో ఠాగూర్ లాంటి చిత్రం ప్లాన్ చేస్తున్న యంగ్ డైరెక్ట‌ర్

చిరంజీవితో ఠాగూర్ లాంటి చిత్రం ప్లాన్ చేస్తున్న యంగ్ డైరెక్ట‌ర్

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. గ‌త కొద్ది రోజులుగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆచార్యతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మే 13న చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమా త‌ర్వాత చిరంజీవి లూసిఫ‌ర్, వేదాళం రీమేక్ చేయ‌నున్నాడు. ఈ చిత్రాల‌కు మోహ‌న్ రాజా, మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

యంగ్ డైరెక్ట‌ర్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలోను చిరంజీవి ఓ సినిమా చేయ‌నుండ‌గా, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నవీన్ ఎర్నేని – వై.రవిశంకర్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను బాబీ కోర్ట్ డ్రామాగా తెర‌కెక్కించ‌నున్నార‌ని, ఠాగూర్ మాదిరిగా స‌మాజంలో జ‌రిగే లోపాల్ని ఎత్తి చూపే క‌థ‌గా ఉంటుంద‌ని టాక్. అలానే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోష‌న్‌తో కూడిన ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ ఉంటుంద‌ని అంటున్నారు. వీర‌య్య అనే టైటిల్‌తో ఈ మూవీ కి ప్ర‌చారం జ‌రుగుతుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చిరంజీవితో ఠాగూర్ లాంటి చిత్రం ప్లాన్ చేస్తున్న యంగ్ డైరెక్ట‌ర్

ట్రెండింగ్‌

Advertisement