సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Sep 30, 2020 , 18:44:46

బ్లాక్ రోజ్ నాకు చాలా స్పెష‌ల్ ఫిలిం: ఊర్వ‌శి రౌటేలా

బ్లాక్ రోజ్ నాకు చాలా స్పెష‌ల్ ఫిలిం: ఊర్వ‌శి రౌటేలా

సంపత్ నంది క్రియేషన్ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్ పై మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వ‌హిస్తున్న చిత్రం బ్లాక్ రోజ్. మిస్ ఇండియా ఊర్వశి  రౌటేలా హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ  ఎమోషనల్ థ్రిల్లర్ నుంచి నా త‌ప్పు ఏమున్న‌ద‌బ్బా ప్రమోషనల్ వీడియో సాంగ్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. ఊర్వశి రౌటేలా మాట్లాడుతూ, " నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. డాన్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. బ్లాక్ రోజ్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమా నటిగా నాలో ఇంకో కోణాన్ని ఆవిష్కరించే అవకాశం ఇవ్వడమే కాకుండా చాలా కష్టమైన డాన్స్ నేర్చుకుని చేసే అవకాశం ఇచ్చింది.

ఈ పాట షూట్ చేయడానికి ముందు చాలా రిహార్సల్స్ చేసాను. దెబ్బలు కూడా తగిలాయి కానీ పాట పూర్తయ్యాక చూసినప్పుడు ఆ కష్టమంతా మర్చిపోయాను. పాట అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్ ఎప్పుడెప్పుడు చూస్తారా అని వెయిట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంపత్ నంది గారికి, శ్రీనివాసా చిట్టూరి గారికి కృతజ్ఞతలు" తెలుపుతున్నాన‌ని చెప్పింది. 


 ప్రమోషనల్ వీడియో సాంగ్ ..


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo