శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 23, 2020 , 12:49:37

నేడు ‘బ్లాక్‌ రోజ్‌’ ఫస్ట్‌లుక్‌

నేడు ‘బ్లాక్‌ రోజ్‌’ ఫస్ట్‌లుక్‌

పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తమ సొంత బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో ప్రొడక్షన్ నంబర్‌ 4గా ‘బ్లాక్ రోజ్’ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్ 17 నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుగుతోంది. రెండు సార్లు మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి, బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన అందాల భామ ఊర్వశీ రౌతేల తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చినా చేయకుండా ‘బ్లాక్ రోజ్’ కథ విన్న వెంటనే ఇంప్రెస్ అయ్యి ఈ చిత్రం చేయడానికి అంగీకరించింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగ్ చేస్తోంది. ఒకే షెడ్యూల్‌లో షూటింగ్‌ పూర్తి చేయాలని భావిస్తోంది. షేక్స్ పియర్ రచించిన ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ‘బ్లాక్ రోజ్’ తెరకెక్కుతోంది. ‘విచక్షణలేని, యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని కాన్సెప్ట్‌ను జోడిస్తూ ‘బ్లాక్ రోజ్’ను తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉండగా చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేయనున్నారు. ఈ మేరకు సంపత్‌ నంది ట్విట్టర్‌లో వివరాలు వెల్లడించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo