‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’, ‘సుకుమారుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు ఆది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాడు. విలక్షణమైన కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు ఆది. ఆ మధ్యకాలంలో వచ్చిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ రీసెంట్గా వచ్చిన ‘శశి’ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కథల ఎంపికలో మరోసారి జాగ్రత్త పడతున్నాడు.
వరుస సినిమాలను లైన్లో పెట్టిన సాయి కుమార్ తనయుడు ఆది బ్లాక్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు జీబీ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది మాత్రం ఆది కెరీర్ లో వచ్చిన సినిమాల్లో మంచి ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుందని టీజర్‌ని బట్టి అర్దమవుతుంది.
టీజర్లో ఆది చెప్పే డైలాగ్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కూడా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేసి వదిలితే ఆది కెరీర్ లో మంచి హిట్ గా నిలవొచ్చు. ఈ చిత్రంలో ఆది సరసన దర్శన హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం అతను ‘అమరన్ ఇన్ ది సిటీ చాప్టర్-1’అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆది కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం. ఎస్.బాలవీర్ రచన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్వీఆర్ నిర్మిస్తున్నారు. అవికా గోర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది తండ్రి సాయి కుమార్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.