ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 01, 2020 , 14:08:47

న‌టుడు, ఎంపీ ర‌వికిష‌న్ కు వై ప్ల‌స్ కేట‌గిరి భ‌ద్ర‌త

న‌టుడు, ఎంపీ ర‌వికిష‌న్ కు వై ప్ల‌స్ కేట‌గిరి భ‌ద్ర‌త

యూపీ: బాలీవుడ్ డ్ర‌గ్స్ లింక్స్ వ్య‌వ‌హారంపై లోక్ స‌భ‌లో మాట్లాడినందు‌కు త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని, భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని బీజేపీ ఎంపీ, న‌టుడు ర‌వికిష‌న్ ప్ర‌భుత్వాన్ని కోరిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు యూపీ ప్ర‌భుత్వం ర‌వికిష‌న్ కు వై కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను క‌ల్పించింది. త‌న విజ్ఞప్తి మేర‌కు వై ప్ల‌స్ కేటగిరీ భ‌ద్ర‌త‌ను క‌ల్పించినందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఎంపీ ర‌వికిష‌న్ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఈ మేర‌కు ఆయన హిందీలో ఓ ట్వీట్ చేశారు.

నా కోసం, నా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల కోసం మీరు వై కేట‌గిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ‌నా కుటుంబంతోపాటు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త‌ క‌ల్పించిన మీకు రుణ‌ప‌డి ఉంటాం. ధ‌న్య‌వాదాలు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స‌భ‌లో ఎప్పుడూ త‌న గ‌ళం వినిపిస్తుంటాన‌ని ర‌వికిష‌న్ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ర‌వికిష‌న్ యూపీలోని గోర‌ఖ్‌పూర్ లోక్ స‌భ స్థానం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo