శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 23, 2020 , 14:11:36

డ్యాన్సింగ్ క్వీన్, యోగా బ్యూటీ మలైకాకు బ‌ర్త్ డే విషెస్‌

డ్యాన్సింగ్ క్వీన్, యోగా బ్యూటీ మలైకాకు బ‌ర్త్ డే విషెస్‌

త‌న అందం, అభిన‌యం డ్యాన్స్ తో కోట్లాది మంది ఫాలోవ‌ర్ల‌ను ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యోగా టిప్స్, ఫిట్ నెస్ పాఠాలు చెప్తూ త‌న ఫాలోవ‌ర్ల‌లో ఫుల్ జోష్ నింపుతుంది మలైకా. నాలుగు ప‌దుల వ‌య‌స్సు దాటినా మెస్మ‌రైజ్ చేసే అందంతో అంద‌రినీ అల‌రించే ఈ భామ‌కు నేడు 47వ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా నెటిజ‌న్లు, అభిమానులు, కోస్టార్లు మ‌లైకాకు పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఫిట్ నెస్ మంత్ర‌ను తూచ త‌ప్ప‌కుండా పాటించే వారిలో మ‌లైకా అరోరా టాప్ లో ఉంటుంది. లాక్ డౌన్ లో ఇంటి ప‌ట్టునే ఉన్న ఈ తార త‌న ఫాలోవ‌ర్ల‌కు ప‌లు యోగాస‌నాలు వేసి చిట్కాలు చెప్పింది. ఇటీవలే కోవిడ్ బారిన ప‌డ్డా ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా వైద్యులు, అధికారుల సూచ‌న‌లు పాటిస్తూ త్వ‌ర‌గా కోలుకుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎప్పటిలాగే త‌న ప‌నిలో చేరిపోయింది. డ్యాన్స్ షోలో పాల్గొని కంటెస్టంట్ల‌లో నూత‌నోత్తేజాన్ని నింపుతుంది. మ‌లైకా బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప‌లు సంద‌ర్భాల్లో  కెమెరా క్లిక్ మనిపించిన‌ ఫొటోలు, వీడియోలు మీకోసం..


View this post on Instagram

#vitamindtherapy#stayhomestaysafe#freehaiboss#VeryVitalVitamin

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.