గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 07, 2020 , 17:37:21

దిగ్గజ నటుడికి వెల్లువెత్తుతున్న బర్త్‌డే విషెస్‌..

దిగ్గజ నటుడికి వెల్లువెత్తుతున్న బర్త్‌డే విషెస్‌..

ముంబయి: బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అనుపమ్‌ ఖేర్‌ పుట్టినరోజు ఇవాళ. ఇవాళ్టితో ఆయన 65వ పడిలోకి ప్రవేశించారు. మార్చి 7, 1955లో సిమ్లాలో జన్మించిన అనుపమ్‌.. సినీ రంగంలో ప్రవేశించి, అంచెలంచెలుగా ఎదిగాడు. బాలీవుడ్‌లో ప్రముఖ నటుల్లో ముందు వరుసలో ఉంటారు అనుపమ్‌ ఖేర్‌. కాగా, ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు, తోటి నటులు ఆయనకు సోషల్‌ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, రాజకీయ నాయకుడు శతృఘ్నసిన్హ.. అనుపమ్‌ ఖేర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, వైవిధ్యమైన నటులు, సామాజిక వేత్త, మానవతావాది అయిన అనుపమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలని శతృఘ్న.. ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. రిషికపూర్‌, అనిల్‌ కపూర్‌.. తదితర సెలబ్రిటీలు అనుపమ్‌ ఖేర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన  వారిలో ఉన్నారు. 

అనుపమ్‌ ఖేర్‌ బాలీవుడ్‌లో దాదాపు 500 చిత్రాల్లో నటించారు. ఉత్తమ నటుడిగా రెండు జాతీయ పురాస్కారాలు అందుకున్నారు. 8 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు సైతం ఆయన సొంతం చేసుకున్నారు. సారాన్ష్‌ సినిమాకు గాను ఆయన ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. ఈయన గతంలో ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్సిస్టిట్యూట్‌కు చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. అనుపమ్‌ ఖేర్‌ మంచి నటుడే కాదు, మంచి రచయిత కూడా. సామాజిక సేవలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటారు. 


logo