బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 15, 2020 , 12:00:45

చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్పెష‌ల్ సాంగ్ విడుద‌ల‌

చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్పెష‌ల్ సాంగ్ విడుద‌ల‌

మెగాస్టార్ చిరంజీవి వార‌సత్వాన్ని పుణికిపుచ్చుకొని టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఎదిగాడు రామ్ చ‌ర‌ణ్‌. ప్ర‌స్తుతం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్‌లో న‌టిస్తున్నాడు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అయితే మార్చి 27న చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే కావడంతో ఇప్ప‌టి నుండే ఆయ‌న అభిమానులు బ‌ర్త్‌డేకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వెంక‌టాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌, రాష్ట్ర చిరంజీవి యువ‌త జ‌న‌రల్ సెక్ర‌ట‌రీ శివ చెర్రీ క‌లిసి  రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్పెష‌ల్ సాంగ్ రూపొందిస్తున్నారు. తాజాగా ఆ పాట‌కి సంబంధించి ప్రోమో విడుద‌ల చేశారు.

బ‌ర్త్‌డే స్పెష‌ల్ సాంగ్‌ని స్కార్‌పియ‌న్ ఆల‌పించారు. పూర్తి సాంగ్‌ని మార్చి 24 సాయంత్రం 4గం.ల‌కి విడుద‌ల చేయ‌నున్నారు. ఫుల్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రో వైపు  ఆర్ఆర్ఆర్ సినిమా ఫ‌స్ట్ లుక్‌ని చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌ల చేస్తార‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌ర‌గ‌గా,దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వ‌స్తుందా అని ఫ్యాన్స్ చాలా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. 
logo