గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 27, 2020 , 08:29:36

బాలుకు బిగ్ బాస్ అశ్రునివాళి.. గంగ‌వ్వ‌కు మ‌హాన‌టి మెడ‌ల్

బాలుకు బిగ్ బాస్ అశ్రునివాళి.. గంగ‌వ్వ‌కు మ‌హాన‌టి మెడ‌ల్

బిగ్ బాస్ సీజ‌న్ 4 స‌క్సెస్ ఫుల్‌గా 21 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. శ‌నివారం రోజు జ‌రిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ బృందం స్వ‌ర‌భాస్క‌రుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు ఘ‌న నివాళులు అర్పించారు.  సింగర్ సునీత వాయిస్ ఓవర్‌తో ఉన్నఏవీని ప్లే చేయ‌గా, ఆ త‌ర్వాత నాగార్జున ఆయ‌న గొప్ప త‌నాన్ని చెబుతూ బాలుకు త‌న సంతాపాన్ని తెలియ‌జేశారు.  

‘‘ఆ స్వరం ఇక పలకదని, ఆ వరం మనకిక లేదని సరిగమలు కన్నీళ్లు పెట్టాయి.. రాగాలన్నీ బాధపడ్డాయి. పాట మూగబోయింది. సంగీతం తన బిడ్డను కోల్పోయింది. కానీ, ఈ ప్రపంచం ఆయన సంగీతాన్ని ఆస్వాదిస్తూనే ఉంటుంది. దాచుకో స్వామి దాచుకో.. మా బాలుని జాగ్రత్తగా దాచుకో. గాన గంధర్వుడు బాలు గారు.. ఆయనొక జ్ఞాపకం కాదు, జీవితం. ప్రతి రోజూ వినిపించే ఆయన పాటలో మనతోనే ఉంటారు. ఆయన స్వరాన్ని వరంగా మన గుండెల్లోనే దాచుకుందాం. వి లవ్ యు సార్.. ఫరెవర్’’ అంటూ బాలుపై త‌న‌కున్న ప్రేమ‌ని చాటారు నాగార్జున‌.

అనంత‌రం హౌజ్‌మేట్స్‌తో ట‌చ్‌లొకి వ‌చ్చేసిన నాగ్‌.. హౌజ్‌మేట్స్ తో సంద‌డి షురూ  చేశాడు. ఉక్కు హృద‌యం టాస్క్ బాగా ఆడార‌ని చెప్పుకొచ్చిన నాగ్ వారంద‌రితో ట్రూత్ ట‌వ‌ర్ గేమ్ ఆడించారు. ఇందులో పిలిచిన ఇంటి స‌భ్యుడు ట‌వ‌ర్‌లో ఉన్న ఒక్కో ధ‌ర్మాకోల్ బాక్స్‌ని తీసేస్తూ నాగ్  అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానాలు ఇచ్చారు. అయితే కుమార్ సాయిని పిలిచిన‌ప్పుడు అత‌ను అభిజిత్‌పై కాస్త అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ అందుకు రీజ‌న్ కూడా చెప్పాడు.

టాస్క్ ఆడేట‌ప్పుడు అభిజిత్ త‌న‌ను లూజ్ , అమర్యాద‌గా మాట్లాడ‌తాడ‌ని అత‌ను సారీ చెప్ప‌క‌పోతే ఉన్న‌న్ని రోజులు అత‌నినే నామినేట్ చేస్తానంటూ కుమార్ సాయి పేర్కొన్నాడు. అలానే అఖిల్ తనకంటే తక్కువ చదువుకున్నాడని, తనకంటే వయసులో చిన్నవాడని, అలాంటిది తనను ఎలా ఒరేయ్ అని పిలుస్తాడని అభిజిత్ తెగ ఫీలయ్యాడని.. అలా అయితే, అభిజిత్ కన్నా తాను పెద్దవాడినని తననెలా తిడతాడని కుమార్ సాయి ఎమోషనల్ అయ్యాడు. అయితే కొద్ది సేపు ఈ వివాదంతో కాస్త ర‌చ్చ జ‌రిగిన చివ‌రికి అభిజిత్ సారీ చెప్ప‌డంతో స‌ద్దుమ‌ణిగింది. 

ఆ త‌ర్వాత మూడు మెడ‌ల్స్‌ని స్టోర్ రూంలో నుండి తెప్పించారు నాగార్జున . ఇందులో మ‌హాన‌టి, మ‌హా న‌టుడు, మ‌హా కంత్రి ఉన్నాయి. మ‌హా కంత్రి అవార్డుని  అమ్మ రాజశేఖర్ .. అవినాష్‌కు వేయ‌గా, మ‌హా న‌టుడు అవార్డును అభిజిత్‌కు వేయాల‌ని నాగార్జున స్వయంగా చెప్పారు. ఇక గంగ‌వ్వ టాస్క్ లో ప్ర‌ద‌ర్శించిన తీరుకు ఫిదా అయిన హౌజ్‌మేట్స్  ఆమెకు మ‌హాన‌టి మెడ‌ల్‌ను ఇవ్వాల‌ని డిసైడ్ అయి ఆ మెడ‌ల్ గంగ‌వ్వ మెడ‌లో వేశారు.  

ఇక చివ‌రిగా మాస్క్ గేమ్ ఆడించాడు నాగ్. హౌజ్‌మేట్స్ కు సంబంధించిన మాస్క్‌లు తెప్పించిన ఆయ‌న ఎవరి పేరు చెబితే వారికి సంబంధించిన బ్యాడ్ క్వాలిటీస్ చెప్పాల‌ని అన్నారు. ముందుగా మోనాల్‌ను అఖిల్ గురించి బ్యాడ్ క్వాలిటీస్ చెప్ప‌మంటే ఊరికే అలుగుతాడు, అప్‌సెట్ అవుతాడ‌ని పేర్కొంది. దీనికి సంబంధించి వెంట‌నే రెస్పాండ్ అయిన అఖిల్ .. స‌ర్ న‌న్ను అభి పేరుతో పిలుస్తూ ఉంటుంద‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు. ఇక నోయ‌ల్‌..రాజ‌శేఖ‌ర్‌లో బ్యాడ్ క్వాలిటీస్ చెబుతూ ఈ మ‌ధ్య మాస్ట‌ర్ కుళ్లు జోకులు వేస్తున్నార‌ని, కొన్ని స‌మ‌యాల‌లో చిన్న పిల్లాడిలా ఎమోష‌న‌ల్ కూడా అవుతుంటారని పేర్కొన్నాడు. 

ఇక దివి.. అభిజిత్ గురించి మాట్లాడుతూ.. అత‌ను క‌నిపించే అంత అమాయ‌కుడు కాదు. అత‌ని లోప‌ల చాలా స్ట‌ఫ్ ఉందంటూ దివి పేర్కొంది. ఇక దేవి..గంగ‌వ్వ గురించి చెబుతూ, ఆమె ఎవరినైతే ఇష్టపడుతుందో వారి తప్పు ఉన్నా వారినే గంగవ్వ సపోర్ట్ చేస్తుందని చెప్పుకొచ్చింది. దీనిని గంగ‌వ్వ కొట్టి పారేసింది. ఇక అవినాష్‌.. లాస్య బ్యాడ్ క్వాలిటీస్ చెప్ప‌మంటే ఆమె ఇంట్లో ఏదో జ‌రిగిపోతుంద‌ని టెన్ష‌న్ ప‌డుతుంటుంది. అసలు ఇంట్లో ఏం జరిగితే ఆవిడకు ఎందుకని అన్నాడు అవినాష్‌.

సుజాత‌.. అభిజిత్ బ్యాడ్ క్వాలిటీస్ చెబుతూ.. అత‌ను అంద‌రితోను క‌ల‌వ‌ట్లేద‌ని చెప్పింది. దీనికి నాగ్ నీతో క‌ల‌వ‌ట్లేదా అంటూ పంచ్ వేశాడు. దీనికి సుజాత న‌వ్వి ఊరుకుంది. ఇక  గంగవ్వని హారిక గురించి చెప్ప‌మంటే ఆమె మొహం కడగకుండానే కాఫీ తాగుతుందని చెప్పింది.  అయితే, దీనిని ఖండించిన హారిక  బ్రష్ చేసి వేడి నీళ్లు తాగిన తరవాతే డ్యాన్స్ చేయడానికి వెళ్తా . ఇది గంగ‌వ్వ గ‌మ‌నించ‌లేద‌నుకుంటా అని పేర్కొంది.

రాజ‌శేఖ‌ర్ .. దివి గురించి చెబుతూ ఆమెకు ఎప్పుడు ఏడ్వాలో ఎప్పుడు న‌వ్వాలో తెలియ‌ద‌ని చెప్పాడు. ఇక చివ‌రిగా లాస్య‌..స్వాతి గురించి చెబుతూ  ఎవరితో క్లోజ్‌గా ఉండాలో స్వాతి ముందుగానే ఫిక్స్ అయ్యి వచ్చిందని.. అదే బ్యాడ్ క్వాలిటీగా అనిపించిందని లాస్య అన్నారు. అయితే ఈ వారం ఇంటి నుండి వెళ్ళేందుకు నామినేష‌న్‌లో  మెహబూబ్, మోనాల్, కుమార్ సాయి, లాస్య, దేవి, అరియానా, హారికలు ఉండ‌గా లాస్య‌, మోనాల్ సేవ్ అయిన‌ట్టు తెలిపారు నాగార్జున‌. మిగ‌తా ఐదుగురిలో ఒక‌రు ఈ రోజు హౌజ్‌ను వీడ‌నున్నారు 


logo