గురువారం 28 మే 2020
Cinema - Apr 29, 2020 , 11:38:35

ఇంటి టెర్ర‌స్‌పై పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ విజేత‌

ఇంటి టెర్ర‌స్‌పై పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ విజేత‌

క‌రోనా వ‌ల‌న ముందుగా నిర్ణ‌యించిన పెళ్ళిళ్లు ఎప్పుడు, ఎలా జ‌రుగుతున్నాయో ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. ఫంక్ష‌న్ హాల్స్ అన్నీ మూత ప‌డ‌డం వ‌ల‌న ఇంటి ప‌రిస‌రాల్లోనే పెళ్లి చేసుకునేందుకు కొంద‌రు ఆస‌క్తి చూపుతున్నారు. మ‌రి కొంద‌రు త‌మ పెళ్లిని కొన్నాళ్ల‌పాటు వాయిదా వేసుకుంటున్నారు. అయితే హిందీలో ప్ర‌సార‌మయ్యే బిగ్ బాస్ షో సీజ‌న్‌2కి చెందిన విజేత అశుతోష్ కౌశిక్ .. అలీఘ‌ర్‌కి చెందిన అర్పిత‌ని త‌న ఇంటి టెర్ర‌స్‌పై వివాహం చేసుకున్నాడు.

ముందుగానే ముహూర్తం నిర్ణ‌యించ‌బ‌డ‌డంతో అశుతోష్‌, అర్పిత‌లు ఆదివారం ఏడ‌డుగులు వేశారు. ఈ పెళ్లికి పురోహితుడితో పాటు వరుడి తల్లి, సోదరి, వధువు తల్లి, సోదరుడు హాజ‌ర‌య్యారు. త‌న పెళ్లికి సంబంధించిన వీడియోని అశుతోష్ త‌న ఫేస్ బుక్ పేజ్‌లో షేర్ చేస్తూ.. నిరాడంబ‌రంగా చేసుకోవ‌డం ద్వారా మిగిలిన డ‌బ్బుల‌ని  పీఎం కేర్స్‌కు విరాళంగా ఇవ్వనున్నట్టు ‌ తెలిపారు.  అలాగే తన యూట్యూబ్‌ చానల్‌ ద్వారా వస్తున్న మొత్తాన్ని కూడా చారిటీకి ఇవ్వనున్నట్టు స్ప‌ష్టం చేశారు.logo