వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగులోఇప్పటి వరకు నాలుగు సీజన్స్ పూర్తి కాగా, ఐదో సీజన్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీజన్ 5 ఉండదని కొందరు అంటుంటే మరి కొందరు సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు.
ఎట్టకేలకు కొద్ది సేపటి క్రితం బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చారు మేకర్స్ . అతి త్వరలోనే సీజన్ 5 ప్రారంభం కానుందని తెలియజేస్తూ ప్రోమో ద్వారా లోగో విడుదల చేశారు. ఈ లోగో గత సీజన్స్‌కి భిన్నంగా ఉంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 5 నుండి ఈ కార్యక్రమం ప్రసారం కానుందని, ఇప్పటికే పలు ప్రోమో షూట్స్ కూడా చేసినట్టు సమాచారం.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగ్ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా చేయకపోవచ్చు అన్న టాక్ నడుస్తోంది. అలాగే రానా సీజన్ 5కు హోస్ట్ అంటూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అందులో నిజం లేదంటూ రానా క్లారిటీ ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే హోస్ట్ ఎవరనే సస్పెన్స్‌కు తెరదించాలని నిర్వాహకులు చూస్తున్నారు.