శనివారం 23 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 20:41:12

బిగ్‌బాస్ టైమింగ్స్‌లో మార్పులు.. ఆ టైమ్‌కు సీరియల్స్ వచ్చేసాయ్!

బిగ్‌బాస్ టైమింగ్స్‌లో మార్పులు.. ఆ టైమ్‌కు సీరియల్స్ వచ్చేసాయ్!

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ 4 తెలుగు  సీజన్ రేటింగ్స్ విషయంలో సదరు ఛానెల్ మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.   ఈ సీజన్ మొదలైనపుడు రేటింగ్స్ బాగానే ఉన్నా ఆ తర్వాత మూడు నాలుగు వారాల తర్వాత టీఆర్పీ   తగ్గుతూ వచ్చింది. మధ్యలో వీకెండ్స్ మాత్రమే దుమ్ము దులిపేస్తుంది. మళ్లీ చివరి నాలుగు వారాల నుంచి గేమ్ బాగా పుంజుకుంది. రేటింగ్స్ కూడా పర్లేదు అనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో స్టార్ మా సంచలన నిర్ణయం తీసుకుంది. బిగ్ బాస్ టైమింగ్స్ మారుస్తూ తాజాగా యాడ్స్ విడుదల చేసారు. 

ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 నిమిషాలకు ప్రసారం అవుతుంది.. వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రం రాత్రి 9 గంటల నుంచి 10:30 వరకు వస్తున్నాయి. కానీ ఇప్పుడు డిసెంబర్ 7 నుండి రాత్రి 10 గంటలకు బిగ్ బాస్ వస్తుందని తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పుడు బిగ్ బాస్ ప్రసారం అవుతున్న సమయంలో వదినమ్మ సీరియల్ రాబోతుంది. అది రాత్రి 7 గంటలకు వచ్చేది.. ఇప్పుడు ఆ సీరియస్ ప్లేస్‌లో గుప్పెడంత మనసు అనే కొత్త సీరియల్ ప్రారంభం అవుతుంది.  దాంతో బిగ్ బాస్ టైమింగ్స్ మారిపోతున్నాయి. 

ఇదిలా ఉంటే బిగ్ బాస్ మరో మూడు వారాలు మాత్రమే ఉంది. డిసెంబర్ 20న బిగ్ బాస్ 4 తెలుగు ముగియనుంది. అందుకే షో టైమింగ్స్ ముందుగానే మార్చేసారు నిర్వాహకులు. దానికితోడు షో ఇప్పటికే మొదలై మూడు నెలలు అయింది కాబట్టి టైమింగ్స్ మార్చినా కూడా ఆడియన్స్ ఎక్కడికి పోరని నమ్మకం. అంటే డిసెంబర్ 7 నుండి రాత్రి 10 గంటల నుండి 11 గంటల మధ్యలో బిగ్ బాస్ ప్రసారం అవుతుంది. 9.30 నిమిషాలకు వదినమ్మ వస్తుందన్నమాట. మరి మార్చిన టైమింగ్స్ బిగ్ బాస్ రేటింగ్స్‌ను కూడా మార్చేస్తాయేమో చూడాలిక.  


logo