మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 14, 2020 , 10:37:28

లాస్య‌కు స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్

లాస్య‌కు స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్

భోగి వేడుక సంద‌ర్భంగా ఇంటి స‌భ్యుల‌ని ఫుల్ ఖుష్ చేశారు బిగ్ బాస్. న‌వ్వ‌కుండా ఉండాల‌ని చెప్పిన‌ప్ప‌టికీ, వారు న‌వ్వ‌డంతో గిఫ్ట్స్ రావేమో అని అంతా అనుకున్నారు. కాని పండ‌గ సంద‌ర్భంగా ఇంటి నుండి వ‌చ్చిన గిఫ్ట్‌ల‌ని బహుమ‌తిగా అందించారు. వాటిని చూసి తెగ మురిసిపోయారు. ఆ త‌ర్వాత గులాబ్ జామూన్ చేసుకొని తిన్నారు.

హౌజ్‌మేట్స్ సంద‌డిని సీక్రెట్ రూంలో నుండి చూస్తున్న అఖిల్ అక్క‌డ నేను లేను అనే బాధ చెందాడు. ఇంటి స‌భ్యులు వారికి వ‌చ్చిన బ‌హుమ‌తులుని చూసి తెగ సంతోషించారు. అఖిల్‌కు  కూడా బిగ్ బాస్ గిఫ్ట్ అందించారు. అయితే లాస్య‌కు బిగ్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌డంతో ఆమె ఆనంద భాష్పాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డం ఎవ‌రి త‌రం కాలేదు.

జున్ను మాట‌ల‌ని బిగ్ బాస్ హౌజ్‌లో వినిపించ‌గా వాటిని వింటూ చాలా ఎమోష‌న‌ల్ అయింది. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నేను నీకు గుర్తు రావ‌డం లేదా అంటూ జున్ను త‌ల‌చుకొని భావోద్వేగానికి గురైంది. అనంత‌రం గ్రీన్ దీపావ‌ళిలో భాగంగా ఇంట్లో క్రాక‌ర్స్ కాల్చ‌కుండా దీపాలు వెలిగించాల‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో  గార్డెన్ ఏరియాలో దీపాలు వెల‌గించి చిందులు వేశారు. ఇక ఈ రోజు నాగార్జున ఎంట్రీ కూడా ఉండ‌డంతో బిగ్ బాస్ సంద‌డి మ‌రో రేంజ్‌లో ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 


logo