తెలుగు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss Season 5) షో సందడి మొదలైంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా ప్రసార కార్యక్రమం ప్రారంభం కాగా..తొలి కంటెస్టెంట్ గా సిరి హన్మంత్ గ్రాండ్ గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కంటెస్టెంట్లను నాగార్జున (Nagarjuna) బిగ్ బాస్ హౌస్ లోకి స్వాగతం పలికారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్ల వివరాలు:
VJ Sunny | రెండో కంటెస్టెంట్ గా వీజే సన్నీ (VJ Sunny) బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన డ్రీమ్ గాళ్ ఫొటోను డ్రాయింగ్ వేయమని సన్నీని అడిగాడు. సన్నీ డ్రాయింగ్ వేసి ఇంట్లోకి వెళ్లగా..అప్పటికే హౌస్ లో ఉన్న సిరి హన్మంత్ అతడికి స్వాగతం పలికింది. కళ్యాణ వైభోగమే సీరియస్ తో పాపులర్ అయ్యాడు వీజే సన్నీ. సకలగుణాభిరామ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేశాడు.
Lahari | మూడో కంటెస్టెంట్ గా లహరి (Lahari) బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. లహరి యాంకర్, న్యూస్ రీడర్, మోడల్‌గా , జర్నలిస్టు మాత్రమే కాకుండా నటి కూడా. ఈ భామ అర్జున్ రెడ్డి చిత్రంలో డాక్టర్ గా కనిపించింది. ఇటీవలే జాంబిరెడ్డి సినిమాలో కూడా మెరిసింది.
Sreerama Chandra | నాలుగో కంటెస్టెంట్ గా ప్రముఖ గాయకుడు శ్రీరామ చంద్ర ( Sreerama Chandra) హౌస్ లోకి వెళ్లాడు. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయేందుకు బిగ్ బాస్ షోకు వచ్చానని చెప్పిన శ్రీరామ చంద్ర నాగార్జున కోసం ఆమని పాడవే తీయగా పాట పాడి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2010లో ఇండియన్ ఐడల్ షోలో విన్నర్ గా నిలిచి పాపులర్ అయ్యాడు శ్రీరామ చంద్ర. వివిధ భాషల్లో 500కు పైగా పాటలు పాడిన ఈ యువ సింగర్ బిగ్ బాస్ షోతో ఎలా అరిస్తాడో చూడాలి.
Anee | తాను బిగ్ బాస్ షో చేయడం లేదని గతంలో చెప్పిన ప్రముఖ కొరియోగ్రాఫర్ హనీ మాస్టర్ ( Anee ) ..అందరికి షాక్ ఇస్తూ ఐదో అభ్యర్థిగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. క్లాస్, మాస్ ఇలా ఏ సాంగ్స్ లో నైనా తన డ్యాన్సింగ్ స్టైల్ తో స్టేజ్ ను షేక్ చేస్తుందీ ఈ లేడీ కొరియోగ్రాఫర్. బిగ్ బాస్ విన్నర్ టైటిల్ ను గెలుస్తానని ధీమాగా చెప్తున్న హనీ మాస్టర్ మరి ఎలా ఎంటర్ టైన్ చేస్తూ టైటిట్ గెలుస్తుందో చూడాలి.
Lobo | ఆరో కంటెస్టెంట్ గా లోబో ( Lobo) బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్, గడ్డం, డ్రెస్సింగ్ తో అందరినీ ఆకట్టుకునే లోబో పాగల్ సినిమా సాంగ్ స్టెప్పులేస్తూ స్టేజ్ పైకి వచ్చాడు. లోబో అసలు పేరు మహ్మద్ ఖయ్యూం. ఎనిమిదో తరగతి వరకే చదువుకున్న లోబో హైదరాబాద్ స్టైల్లో యాంకరింగ్ చేస్తూ చాలా మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.
Priya| ఏడో కంటెస్టెంట్ గా ప్రియ (Priya) బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. ఈమె పూర్తి పేరు మామిళ్ల శైలజ ప్రియ. 1998లో మాస్టర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది ప్రియ. ఆ తర్వాత పలు సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రియసఖి సీరియల్ కు నంది అవార్డు అందుకుంది ప్రియ. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.
Jessie | మోడల్ జెస్సీ (Jessie) ఎనిమిదో కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. యాడ్స్ లో నటించిన జెస్సీ పలు అవార్డులను అందుకున్నాడు. ఎంత మంచివాడవురా సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు. మరి బిగ్ బాస్ షో ద్వారా జెస్సీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.
Priyanka singh | ట్రాన్స్ జెండర్ ప్రియాంకా సింగ్ (Priyanka singh ) తొమ్మిదో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. జబర్థస్త్ షో ద్వారా లేడీ గెటప్ తో అలరించాడు సాయితేజ. ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకుని ప్రియాంకా సింగ్ గా పేరు మార్చుకుని అతడు కాస్తా ఆమెగా మారిపోయాడు. మరి ప్రియాంకా సింగ్ బిగ్ హౌస్ లో ఎలా ఉండబోతుంది..? ఏవిధంగా అందరి మనసులు గెలుచుకుంటుందో చూడాలి.
Shanmukh | పదో కంటెస్టెంట్ గా షణ్ముఖ్ (Shanmukh) బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Hamida | పదకొండవ కంటెస్టెంట్ గా హమిద హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
Nataraj | పన్నెండో కంటెస్టెంట్ గా నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు.
Sarayu | పదమూడో కంటెస్టెంట్ గా సరయు హౌస్ లోకి వచ్చింది.
Vishwa | 14వ కంటెస్టెంట్‌గా విశ్వ ఎంట్రీ ఇచ్చాడు.
Umadevi | 15వ కంటెస్టెంట్ గా ఉమాదేవి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చింది.
Maanas | మానస్ 16 వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.