గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 10, 2020 , 09:31:21

అవినాష్‌లోకి బిగ్ బాస్ ఆత్మ‌..

అవినాష్‌లోకి బిగ్ బాస్ ఆత్మ‌..

బిగ్ బాస్ సీజ‌న్ 4లో శుక్ర‌వారం ఎపిసోడ్ ఎమోష‌న్స్‌తో పాటు స‌ర‌దాగా సాగింది. మార్నింగ్ మ‌స్తీలో అంద‌రు అమ్మ‌పై త‌మ‌కున్న ప్రేమ‌ను తెలియ‌జేస్తూ ఎమోష‌న‌ల్ కాగా, ఆ త‌ర్వాత ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ తో బిజీ అయ్యారు. ల‌గ్జ‌రీ బ‌డ్జెట్‌ టాస్క్‌లో ఎవ‌రు ఎక్కువ కార్డ్స్ పొందితే వారికి ప్ర‌త్యేక‌మైన గిఫ్ట్‌తో పాటు ఆయిల్‌తో మ‌సాజ్ చేసుకొనే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని తెలిపారు బిగ్ బాస్. పోటీలో మెహ‌బూబ్, అఖిల్‌లు పాల్గొన‌గా మెహ‌బూబ్ 12 పాయింట్స్‌తో విజేత‌గా నిలిచాడు. దీంతో అతనికి గిఫ్ట్‌తో పాటు మోనాల్‌తో మ‌సాజ్ చేయించుకునే అవ‌కాశం ద‌క్కింది. 

గ‌త వారం జ‌రిగిన ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో నా వ‌ల‌న అంద‌రికి తిండి లేకుండా పోయింద‌ని అంద‌రు తెగ బాధ‌ప‌డ్డారు. కాని ఇప్పుడు అదే తింటున్నారు. ఈ పాయింట్ గుర్తు పెట్టుకో. నేను అన్న‌మే మ‌ట్టను అంటూ మోనాల్‌తో త‌న బాధ‌ను చెప్పుకొచ్చాడు.నేను  దేవుడిని న‌మ్ముతాను, అన్నీ ఆయ‌నే చూసుకుంటాడు అని అఖిల్‌..మోనాల్‌తో అన‌గా దీనికి స్పందించిన మోనాల్ నా మీద న‌మ్మ‌కం లేదా అంటే జీరో పర్సెంట్ కూడా లేద‌ని  స‌ర‌దాగా చెబుతాడు.

ఇక ఇన్నాళ్ళు కేవ‌లం త‌న వాయిస్‌తోనే మిమ్మ‌ల్ని అల‌రిస్తున్న బిగ్ బాస్  ఇప్పుడు మీ ముందు సాక్షాత్కారం కాబోతున్నాడు. బిగ్ బాస్ ఆత్మ అవినాష్‌లోకి వ‌స్తుంది. ఆయ‌న ద్వారా మీరు ఎలాంటి ప్ర‌శ్న‌లైన అడ‌గొచ్చు. వాటికి అవినాష్ త‌ప్ప‌క స‌మాధానం ఇస్తార‌ని బిగ్ బాస్ చెప్తారు. ఉరుములు మెరుపులు రాగానే బిగ్ బాస్ ఆత్మ అవినాష్‌లోకి వ‌చ్చేసింది. ఆయ‌న‌ని హౌజ్‌మేట్స్ స‌ర‌దా ప్ర‌శ్న‌లు అడ‌గ‌గా, వాటికి ఫ‌న్నీ ఆన్స‌ర్స్ ఇచ్చాడు అవినాష్‌. 

ఇక అఖిల్‌, అభిజిత్‌, మోనాల్ ల మ‌ధ్య న‌డుస్తున్న ట్రాక్ గురించి అర్ధ‌రాత్రి చ‌ర్చించారు. మోనాల్ స‌మ‌క్షంలోనే దివి,రాజ‌శేఖ‌ర్‌లు ఈ టాపిక్‌పై మాట్లాడారు. దివి.. మోనాల్‌తో మాట్లాడుతూ.. మీ ముగ్గురి మ‌ధ్య ఏం జ‌రుగుందో నాకు తెలియ‌దు కాని, మోనాల్‌కు నేనంటే ఇష్ట‌మ‌ని అభి, అఖిల్‌లు ఫీల‌వుతున్నారు. ఈ విష‌యంలోనే వారిద్ద‌రు కాస్త హ‌ర్ట్ అవుతున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. ఇద్ద‌రు జెన్యూన్‌గానే ఉంటున్నారు కాని, ఇద్ద‌రి మైండ్‌లో నువ్వేమ‌న్నా క్రియేట్ చేసావేమో అనిపిస్తుంది అని దివి చెప్పుకొచ్చింది

దివి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చిన మోనాల్‌.. ‘నేను ఇద్దర్నీ లైక్ చేస్తున్నా.. కానీ పేరుని వాడటం ఇష్టం లేదు.. మా మధ్య ఏం జరగలేదు.. చిన్న మ్యాటర్‌ని పెద్దదిగా చేస్తున్నారు’ అని క్లారిటీ ఇచ్చింది మోనాల్. అయితే స్వాతి వ‌చ్చాక ట్రాక్ మారింద‌ని రాజ‌శేఖ‌ర్ చెప్పారు. ఇక ఈ రోజు శ‌నివారం కావ‌డంతో ఎలిమినేష‌న్ ప్రక్రియ ఉండ‌నుండ‌గా, ఎవ‌రు ఇంటి నుండి బ‌య‌ట‌కు వెళ‌తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. 


logo