గురువారం 21 జనవరి 2021
Cinema - Dec 05, 2020 , 17:42:52

తల్లి కాబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ హరితేజ

తల్లి కాబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ హరితేజ

సినిమా రంగంలో కొందరికి తమ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు వస్తుంది.  చాలా ఏళ్ల క్రితమే సినిమా రంగంలోకి వచ్చినా  ప్రేక్షకులకు పరిచయం కావడానికి కొందమందికి చాలా టైమ్ పడుతుంది.  అలాంటి వారిలో  ముద్దుగుమ్మ హరితేజ. చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి వచ్చి.. సీరియల్స్ చేసినా కూడా రాని గుర్తింపు బిగ్ బాస్ సీజన్-1తో వచ్చింది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సీజన్-1లో హరితేజ చాలా బాగా పాపులర్‌ అయింది.   

ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ బ్యూటీ ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. ప్రస్తుతం ఈమె గర్భవతి. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది హరితేజ. ఈమె గర్భంతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన  హరితేజతో పాటు ఆమె భర్త దీపక్‌కు కూడా అభిమానులు విషెస్‌ చెబుతున్నారు. 

త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అఆ’ సినిమాలో పనిమనిషి పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఆ తర్వాత రియాలిటీ షోలకు యాంకర్ గా మారిపోయింది. బిగ్ బాస్ లో ఆమె చెప్పిన బుర్రకథలు బాగానే ఫేమస్ అయ్యాయి. ఈమెకు పెళ్లైందనే విషయం అప్పటి వరకు కూడా ప్రేక్షకులకు తెలియదు. పెళ్లి తర్వాత కూడా అవకాశాల కోసం ప్రయత్నించింది.  ఇప్పుడు గర్భంతో ఉండటంతో కొన్నాళ్లుగా సీరియల్స్, సినిమాలకు దూరంగానే ఉంది.   త్వరలోనే ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని మళ్లీ కెరీర్ ఫ్రెష్ గా మొదలు పెడతానని చెప్పింది హరితేజ.
logo